Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
లియోనార్డ్ డికాప్రియో ‘ఆరంభం’
     టైటానిక్‌ ఫేమ్‌ లియోనార్డ్ డికాప్రియో నటించిన తాజా చిత్రం 'ఇన్‌సెప్షన్‌. తెలుగులో 'ఆరంభం పేరుతో విడుదలవ్ఞతోంది. 'ఎవరూ తప్పిచుకోలేరు అనేది ఉపశీర్షిక. ప్రపంచవ్యాప్తంగా జూలై 16న విడుదలకానుంది.

‘ఆరంభం’ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ అంతటా రత్న సెల్యులాయిడ్స్‌ సమర్పణలో మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. సంస్థ తెలుగు, హిందీ, ఇంగ్లీషు వెర్షన్స్‌ను విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతినిథి రజత్‌ పార్థసారథి మాట్లాడుతూ ''ద డార్క్‌ రైట్‌ చిత్రం తర్వాత క్రిస్టీఫర్‌ నోలన్‌ రూపొందించిన చిత్రమిది.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే... ఒక సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. ఇందులో హీరో లియోనార్ట్ డికాప్రియ ఇతరుల ఐడియాలను తస్కరిస్తూ తనకు అనువ్ఞగా ఉపయోగించుకుంటూ వుంటాడు. ఆ తర్వాత తన ఐడియాలను వారి మనసులలో చొప్పించటం కూడా చేస్తూ వుంటాడు. ఇది మైండ్‌ కంట్రోల్‌ కాదు, సైకిక్‌ పవర్‌ కాదు. ఇతరుల స్వప్న లోకంలో విహరిం చేందుకు అత్యాధునికంగా కనుగొన్న ఒకనొక సాంకేతిక ప్రక్రియ ద్వారానే ఇవన్నీ చేస్తూ వుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది? అనే అంశాన్ని ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించాడు అని అన్నారు. 'ఈ చిత్రం దాదాపు 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమయింది.

లియోనార్ట్‌ డికాప్రియో, కెన్‌ వతనాబ్‌, జోసెఫ్‌ గోర్ఘాన్‌. లెవిట్‌, మరియాన్‌ కెటిల్గార్ట్‌, ఎలెన్పేజ్, టామ్ హార్టీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : వ్యాలీ ఫిస్టర్, కథ, దర్శకత్వం: క్రిస్టఫర్‌ నోలన్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com