Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
కార్తీ, తమన్నాల 'ఆవారా'
      'యుగానికొక్కడు' హీరో కార్తీ, తమన్నా జంటగా 'పందెంకోడి' దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఆవారా' ఏప్రిల్‌ 9న విడుదలవుతోంది. మిలింద్‌ సోమన్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 'వినాయకుడు' ఫేమ్‌ సోనియా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో లింగుస్వామి మాట్లడుతూ - ఉద్యోగం వెదుకుతున్న ఓ సరదా కుర్రాడు తొలిచూపులోనే ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా ఆమెతో కలిసి అతను చేసే ప్రయణమే ఈ చిత్ర కథాంశం. రాంగోపాల్‌ వర్మ నిర్మాణ విధానం, భాగ్యరాజా తరహా స్క్రిప్టుతో ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రం చేశాను కార్తీ స్టైలిష్‌గా, తమన్నా అద్భుతంగా నటించారు. యువన్‌ శంకర్‌రాజా 5 మంచి పాటలు ఇచ్చారు - అని చెప్పారు.

తమన్నా మాట్లాడుతూ - యాక్షన్‌తో పాటు సాగే మంచి లవ్‌స్టోరీతో ఈ చిత్రం చేశారు. లింగుస్వామితో చేయడం హ్యాపీగా ఉంది. ఇందులో కొత్త కొత్త సన్నివేశాలున్నాయి. ఎక్కువగా మాట్లాడని, సింపుల్‌గా ఉండే అమ్మాయి పాత్రని ఇందులో చేశాను - అని చెప్పారు.

కార్తీ మాట్లాడుతూ - ఇందులో నా పాత్ర, లుక్స్‌, పెర్ఫార్మెన్స్‌ కొత్తగా ఉంటాయి. స్టైలిష్‌ యాక్షన్‌తో రొమాంటిక్‌గా ఈ చిత్రం ఉంటుంది. లింగుస్వామి బ్రాండ్‌తో లవ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయి. బెంగుళూరు నుండి ముంబాయికి కారు ప్రయాణంలోనే ఈ చిత్రం ఎక్కువగా జరుగుతుంది. కారులో సన్నివేశాలను కెమేరామెన్‌ మది చాలా బాగా తీశారు. తమన్నా చాలా ఓపికగా నటించింది - అని అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com