ఫిలిం న్యూస్
 
 
 
 
జనవరిలో బాలయ్య చిత్రం

నందమూరి బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.కుమార్‌చౌదరి నిర్మిస్తున్న చిత్రం జనవరిలో విడుదల కానుంది. ఆరు పాటలతో సహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. తాతగా, తండ్రిగా, తనయునిగా ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆయనకు జోడీలుగా నటిస్తున్నారు. బాలయ్య సినిమా సరైన విజయాన్ని అందుకుంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'సింహా' చిత్రాలు నిరూపించాయి.

వాటిని మించే రీతిలో ఈ సినిమా ఉంటుందని చెప్పగలను. మా దర్శకుడు పరుచూరి మురళి అంత అద్భుతంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ నెల చివరివారంలో పాటలను విడుదల చేస్తాం. కళ్యాణిమాలిక్ అద్భుతమైన బాణీలు సమకూర్చారు. ముఖ్యంగా ఆయన కంపోజ్ చేసిన నేపథ్యసంగీతం సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. .జనవరిలో సినిమాను రిలీజ్ చేస్తాం' అన్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎం.ఎస్.నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: సందీప్.