Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ఎన్టీఆర్‌ 'అదుర్స్‌'‌
     ఎన్టీఆర్‌ కథానాయకుడిగా వైష్ణవి ఆర్ట్స్‌ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'అదుర్స్‌'. వి.వి.వినాయక్‌ దర్శకుడు. వల్లభనేని వంశీమోహన్‌ నిర్మాత. కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమర్పకులు. నయనతార, షీల కథానాయికలు. ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 'అదుర్స్‌' లోగోను హైదరాబాద్‌లో వినాయక్‌, ఎన్టీఆర్‌ కలిసి ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''నేను వినాయక్‌తో కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. హ్యాట్రిక్‌ చిత్రానికి 'అదుర్స్‌' అనే పేరు చాలా బాగా కుదిరింది. మేం ఖరారు చేయడానికి ముందే అభిమానులకి ఈ పేరు బాగా చేరువైంది. డిసెంబరు మొదటి వారంలో ఆడియో, మూడో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామ''ని అన్నారు. దర్శకుడు వినాయక్‌ మాట్లాడుతూ ''అదుర్స్‌ అనేది ఎన్టీఆర్‌ మీద గొప్ప టైటిల్‌ అవుతుంది. ప్రేక్షకులు హాయిగా నవ్వుకొనేలా సాగుతుందీ చిత్రం. చక్కటి యాక్షన్‌ దృశ్యాలుంటాయి. అయితే ఎక్కడా హింసకు తావుండదు. ఎన్టీఆర్‌, బ్రహ్మానందం కామెడీ ప్రత్యేక ఆకర్షణగా మిగులుతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి మాతో ఉన్న నల్లమలుపు బుజ్జికి ప్రత్యేక ధన్యవాదాల''ని చెప్పారు. వంశీ, నాని మాట్లాడుతూ ''మా సినిమాకు టైటిల్‌ ముందుగా మీడియానే ఖరారు చేసింది. ఆ టైటిల్‌నే మేమూ అనుకున్నాం. మంచి సినిమాను తెరకెక్కించామ''ని అన్నారు. బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, రఘుబాబు, తనికెళ్ల భరణి, మహేష్‌ మాంజ్రేకర్‌, నాజర్‌, సాయాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి, ముఖుల్‌దేవ్‌, సుప్రీత్‌, రమాప్రభ, రాజ్యలక్ష్మి, సుధ, వినయప్రసాద్‌ తదితరులు నటించారు. కథ-మాటలు: కోన వెంకట్‌, పాటలు: చంద్రబోస్‌, కులశేఖర్‌, రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com