బాలకృష్ణ, లక్ష్మీరాయ్ జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రానికి
'అధినాయకుడు' అని టైటిల్ నిర్ణయించారు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం
కళ్యాణిమాలిక్. శనివారం హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు.
నిర్మాత మాట్లాడుతూ "ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. కథను బట్టి ఈ సినిమాకి 'అధినాయకుడు'
అని టైటిల్ నిర్ణయించాం. ఈ పేరును దర్శకుడు పరుచూరి మురళి సూచించారు. ఇప్పటికే మీడియాలో కూడా ఇదే
పేరు ప్రచారం కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అందుకే ఈ పేరునే సినిమాకి ఫైనల్ చేశాం. ఇందులో బాలకృష్ణ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. గతం దసర
సందర్భంగా బాలకృష్ణ పెద్దాయన వేషంలో ఉన్న గెటప్‌ని రిలీజ్ చేశాం. ఇప్పుడు మరో గెటప్‌ని విడుదల చేస్తున్నాం.
పెద్దాయన గెటప్‌లో బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్‌లా ఉన్నారు. పెద్దాయన క్యారెక్టర్‌పై చిత్రీకరించిన పాట హైలెట్‌గా
ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పాటలుంటాయి.
సంక్రాంతి తరువాత ఆడియో విడుదల చేసి, మహాశివరాత్రికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్
చేస్తున్నాం '' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "కథ వినగానే బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఒకే అన్నారు.
ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆయన నన్ను ఓ తండ్రిలా ప్రోత్సహించారు. ఈ సినిమాలోని మూడు
క్యారెక్టర్స్‌ని ఎంతో కష్టపడి డీల్ చేశాం.
బాలయ్య చాలా అద్భుతంగా నటించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మాణానికి సహాయం
అందించారు '' తెలిపారు. సంగీత దర్శకుడు కళ్యాణిమాలిక్ మాట్లాడుతూ " ఈ సినిమాకి సంగీతం అందించే అవకాశం
బాలకృష్ణగారు కల్పించారు. ఆయన ఇచ్చిన భరోసాతో మంచి పాటలు అందించా. ఫైనల్ అవుట్‌పుట్ చూసి ఆయన
చాలా సంతోషపడ్డారు'' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత భాస్కరభట్ల, కెమెరామెన్ సురేందర్‌రెడ్డి,
నిర్మాత కుమారుడు రవికిరణ్ పాల్గొన్నారు.