Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
కృష్ణుడి 'అమాయకుడు' పూర్తి‌‌
      ఆక్టెగాన్‌ మూవీస్‌ పతాకంపై కృష్ణుడు హీరోగా భారతీ గణేష్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'అమాయకుడు' చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు భారతీ గణేష్‌ మాట్లాడుతూ -

ప్రతి మనిషిలో అమాయకుడు ఉంటాడు. అదే మనిషిలో అద్భుత ప్రతిభావంతుడు కూడా ఉంటాడు. సాధారణంగా మన కుటుంబాల్లో అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడితే తల్లిదండ్రులు మరో అమ్మాయిని చూస్తుంటారు. అటువంటి కథతో ఫీల్‌ గుడ్‌ మూవీగా దీన్ని రూపొందిస్తున్నాం. 'అమాయకుడు'గా కృష్ణుడు చాలా బాగా నటించారు. 'నానోడిగళ్‌'లో నాయికగా చేసిన అనన్య ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది, పూనమ్‌ సింగార్‌, గీతా సింగ్‌ కూడా కథానాయికలుగా చేశారు. అలేఖ్య హీరో సోదరిగా నటించింది. రావు రమేష్‌, చరణ్‌ రాజ్‌ మంచి పాత్రలు పోషించారు. ఘటికాచలం మంచి సంభాషణలు, మణికాంత్‌ కాద్రి మంచి పాటలు అందించారు - అని అన్నారు.

కృష్ణుడు మాట్లాడుతూ - ముగ్గురు అమ్మాయిలతో నా పాత్ర అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నారు. అందమైన ప్రేమ కథగా వినోదాత్మకంగా ఉంటుంది. 'అమాయకుడు' పేరుకు 'వాడే నాయకుడు' అని ట్యాగ్‌లైన్‌ పెడుతున్నాం - అని చెప్పారు. పూనమ్‌ మాట్లాడుతూ - మంచి యూనిట్‌తో కలిసి చేయడం ఆనందంగా ఉంది. చక్కటి ప్లానింగ్‌తో ఈ చిత్రం నిర్మించారని అంది. సుమన్‌ శెట్టి, జాస్పర్‌, జయరామ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com