చంద్రసిద్ధార్థ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అందరి బంధువయ'. శర్వానంద్, పద్మప్రియ జంటగా నటించారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ''మన కోసం మనం బతకడంలో ఆనందం లేదు. తోటివారి కోసం ఒక్క క్షణం ఆలోచించినా చాలు అని చెప్పే కథ ఇది. పరోపకారంతోనే ఆనందాన్ని పొందే యువకుడిగా కథానాయకుడు కనిపిస్తాడు. ఒకరికి సాయం చేసే విషయంలో అతడు తీసుకున్న నిర్ణయం కథను మలుపు తిప్పుతుంది. అదేమిటి? దాని పర్యవసానాలు ఏమిటి? అన్నది తెర మీదే చూడాలి. శర్వానంద్, పద్మప్రియ... వీరిద్దరి నటన నేటి తరానికి తప్పకుండా నచ్చుతుంది. తొలి కాపీ సిద్ధమైంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ''న్నారు. నరేష్, ఆర్.కె., కృష్ణభగవాన్, విజయ్, ఎమ్మెస్ నారాయణ, ప్రగతి తదితరులు నటించారు. నిర్వహణ: యుటోపియా ఎంటర్‌టైనర్స్, రచన: బలభద్రపాత్రుని రమణి, పాటలు: చైతన్యప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: జె.కె.గుమ్మడి.
|