ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'ప్రేమకావాలి' నిర్మించిన కె.అచ్చిరెడ్డి తాజాగా దేవా కట్టా దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య' నిర్మిస్తున్నారు. విజయదశమి పర్వదినాన సంస్థ కార్యాలయంలో ప్రారంభోత్సవం జరిగింది. నాగచైతన్య, సమంతలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అధినేత కె.అచ్చిరెడ్డి క్లాప్ నివ్వగా, నవభారత్ ఇండిస్టీస్ డైరెక్టర్, ఎల్లోఫ్లవర్స్ అధినేత, ప్రముఖ నిర్మాత రమేష్ పుప్పాల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రం ఈరోజు నుంచి ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్‌రెడ్డి, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, అజరు, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, మధు, పృథ్వీ, గాంధీ, అజరు ఘోష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్, సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఆర్ట్: రవీందర్.
|