Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
రోహిత్ ’బాణం’
     'త్రి ఏంజెల్స్‌ స్టూడియో' పతాకంపై హిట్‌ చిత్రాల నిర్మాత, వైజయంతీమూవీస్‌ అధినేత చలసాని అశ్వనీదత్‌ కుమార్తె శేషు ప్రియాంక నిర్మిస్తున్న 'బాణం' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 16న విడుదలకు సన్నాహమవుతోంది. నారా రోహిత్‌ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలయ్యాయి. వనమాలి, రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య రచించిన అసలుసిసలైన తెలుగు పాటలుగా 'బాణం' ఆడియో ఆకట్టుకుంటోందని శేషు ప్రియాంక శుక్రవారం పత్రికల వారికి తెలిపారు. కదిలే పాదం, నాలో నేనేనా, పదరా పదరా మోగింది జేగంట, బాణం థీమ్‌మ్యూజిక్‌లతో రిలీజైన ఆడియో 'ది బెస్ట్‌'గా నిలుస్తుందని ఆమె చెప్పారు. బొబ్బిలి, విజయనగరం, భీమిలి, విశాఖ, పొలాచి, అలెపి, పాలఖడ్‌లలో ఈ చిత్రం షూటింగ్‌ జరిగిందని దర్శకుడు చైతన్య పేర్కొన్నారు. రోహిత్‌, వేదికల కలయికలో వస్తున్న ఈ చిత్రం అందరి అభినందనలు అందుకుంటుందని ఆయనన్నారు అనిల్‌ భండారి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com