గతంలో ‘బ్యాచ్‌లర్స్’ చిత్రంలో నటించిన జాకీర్... ఇప్పుడు ‘బ్యాచ్‌లర్స్-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి కథానాయకుడు కూడా ఆయనే. ఎంవై హుసేన్, వై.శ్రీరామ్ ఈ చిత్రానికి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వివరాలను జాకీర్ తెలుపుతూ ‘‘ఇంగ్లీషులో వచ్చిన రోడ్‌ట్రిప్, అమెరికన్‌పై అనే చిత్రాల స్ఫూర్తితో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ‘బ్యాచ్‌లర్స్-2’ చిత్ర కథను తయారు చేసుకున్నాను.
యూత్‌ఫుల్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. నటుడిగా, దర్శకుడిగా ఈ సినిమా నాకు పూర్తి సంతృప్తినిచ్చింది’’ అని చెప్పారు. ‘‘40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే పోస్ట్‌ప్రొడక్షన్ మొదలుపెడతాం. ఈ సినిమా మా సంస్థకు మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు.
ఎవిన్, తృప్తి శర్మ, సుమిత్‌రాయ్, బాషా, రాజశేఖర్, తనికెళ్లభరణి, జీవా, గౌతంరాజు, దువ్వాసి, సత్యనారాయణరెడ్డి, ‘చిత్రం’శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: కలువసాయిరామ్, సంగీతం: సందీప్, కెమెరా: అమర్‌కుమార్.