సిద్ధార్ధ కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం 'బావ'. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ప్రణీత కథానాయిక. శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఈనెల 19 నుంచి 14 రోజులపాటు హైదరాబాద్‌లో జరగనుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... 'తొలి షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో చేశాం. రెండో షెడ్యూల్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పరిసరాల్లో చేశాం. గోదావరి తీరాన పెదపట్నం లంకలో వేసిన సెట్‌లో సిద్ధార్ధ్, ప్రణీతపై ప్రేమ సన్నివేశాలు తీశాం. జిన్నూరు, వేడంగి, పాలకొల్లు పరిసరాల్లో సిద్దార్ధ్ అతని స్నేహితులపై ఎంట్‌టైన్‌మెంట్స్ సన్నివేశాలు తీశాం. ఇందులో రాజేంద్రప్రసాద్, సిద్దార్ధ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. వారిద్దరి మధ్యసాగే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. మూడో షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం' అన్నారు.
దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ...'అందమైన పల్లె వాతావరణంలో బావా మరదళ్ల మధ్య జరిగే ప్రేమకథా చిత్రమిది. అరవింద్‌కృష్ణ ఛాయాగ్రహణం, చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. ఒక్కో దృశ్యం ఒక్కో పెయింటింగ్‌లా ఉంటుంది. చక్రి అద్భుతంగా పాటలను చేశారు. ఇందులో రెండు పాటలకు ప్రభుదేవా నృత్య దర్శకత్వం సమకూర్చనున్నారు' అన్నారు.