'ఇలా రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చెయ్యొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను' ఇది సూపర్‌స్టార్ మహేష్
'బిజినెస్‌మేన్' ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేసిన టీజర్‌లోని డైలాగ్.. ఈ డైలాగ్‌కు ఆడియన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి వండర్‌ఫుల్ రెస్పాన్స్
వచ్చింది. 11-11-11న 'బిజినెస్‌మేన్' ఫస్ట్ స్టిల్ రిలీజ్ అయింది. ఈ స్టిల్‌లో మహేష్ లుక్ అదిరింది. ముంబాయి నేపథ్యంలో
రూపొందుతున్న 'బిజినెస్‌మేన్' బిజినెస్ పరంగా తెలుగు సినీ చరిత్రలో నూతనాధ్యాయానికి తెరతీయబోతోంది. ఆర్.ఆర్. మూవీ
మేకర్స్ పతాకంపై డేరింగ్ ప్రొడ్యూసర్ డా. వెంకట్ ప్రెస్టీజియస్‌గా నిర్మించిన 'బిజినెస్‌మేన్' నిర్మాణం డిసెంబర్ 8 కల్లా పూర్తవుతుంది.
ఓ ప్రక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్‌గా జరుగుతోంది. డిసెంబర్ 2వ వారంలో ఆడియో రిలీజ్ చేస్తున్నారు. జనవరి 11న వరల్డ్ వైడ్‌గా
అత్యధిక థియేటర్స్‌లో 'బిజినెస్‌మేన్'ని రిలీజ్ చెయ్యడానికి ఆర్.ఆర్. ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ భారీ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ''హీరోయిజంలో పీక్ లెవెల్స్‌లో వుండేలా 'బిజినెస్‌మేన్'లో మహేష్ క్యారెక్టర్ ట్రీట్ చెయ్యడం
జరిగింది. మహేష్ సూపర్ పెర్‌ఫార్మెన్స్ 'బిజినెస్‌మేన్'ను చాలా పెద్ద రేంజ్‌కు తీసుకెళ్తుంది. 'పోకిరి' తర్వాత మహేష్‌తో చేస్తున్న ఈ
సినిమా బాక్స్‌లు బద్దలు కొట్టడం ఖాయం'' అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్, కాజల్, ప్రకాష్‌రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ,
భరత్‌రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.,
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్: విజరు, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: దినేష్, కో-డైరెక్టర్:
విజయరామ్‌ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా|| వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.
|