ఫిలిం న్యూస్
 
 
 
 
వర్మ 'బెజవాడ రౌడీలు'
నాగార్జునతో 'శివ' తీసి సంచలనం సృష్టించిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ ఇప్పుడు నాగచైతన్యతో 'బెజవాడ రౌడీలు' అనే సెన్సేషనల్‌ మూవీని నిర్మిస్తున్నారు. యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా వందిత కోనేరు సమర్పణలో శ్రేయ ప్రొడక్షన్‌ పతాకంపై వివేక్‌కృష్ణ దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మిస్తున్న భారీ చిత్రం షఉటింగ్‌ మే 12న విజయవాడలో ప్రారంభమైంది.

వివేక్‌ చెప్పిన 'బెజవాడ రౌడీలు' కథ విని ఎంతో థ్రిల్‌ అయిన రామ్‌గోపాల్‌వర్మ తనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. 20 ఏళ్ళ క్రితం బెజవాడలో వుండే వాతావరణాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు. అయితే అప్పటి వ్యక్తుల గురించిగానీ, అప్పటి సంఘటనల గురించి గానీ లేకుండా పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ మూవీగా ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. 'బెజవాడ రౌడీలు' నాగచైతన్యని ఓ కొత్త యాంగిల్‌లో చూపించే సినిమా అవుతుంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ ఈనెల 27 వరకు విజయవాడలో జరుగుతుంది. జూన్‌, జూలై ఆగస్ట్‌ నెలల్లో జరిగే మరో మూడు షెడ్యూల్స్‌తో చిత్రాన్ని పూర్తి చేసి విజయదశమికి బెజవాడ కనకదుర్గమ్మ కానుకగా అక్టోబర్‌లో విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన ఓ ప్రముఖ హీరోయిన్‌ నటించే ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్‌, ఆహుతి ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్‌, ముకుల్‌ దేవ్‌, అజరు, అశోక్‌కుమార్‌, ఫణి, భరత్‌, శ్రావణ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమర్‌ మోహ్లే, ప్రేమ్‌, ధరమ్‌సందీప్‌, విశాల్‌, ఫైట్స్‌: ఇజాజ్‌, జావేద్‌, సమర్పణ: వందిత కోనేరు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: వివేక్‌కృష్ణ్ణ, నిర్మాతలు: రామ్‌గోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్‌ కోనేరు.