ఫిలిం న్యూస్
 
 
 
 
బ్రేకింగ్‌ న్యూస్‌ బాబూరావు !
శివాజీ కథానాయకుడిగా ‘బ్రేకింగ్‌ న్యూస్‌ బాబూరావు‌’ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సోమా విజయ్‌ప్రకాష్‌ నిర్మాణ సారధ్యంలో తేజస్వి క్రియేషన్స్‌, సూరితల్లి క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. జి.తిరుపతిరావు, కాదులూరి చెల్లారెడ్డి, పెదిరెడ్ల బాల త్రినాథ్‌ నిర్మాతలు. కర్రి బాలాజీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శివాజి, సోమా విజయ ప్రకాష్‌, బాలాజీ, తిరుపతిరావు, చెల్లారెడ్డి, బాల త్రినాథ్‌, ఎం.ఎం.శ్రీలేఖ, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.

హీరో శివాజి మాట్లాడుతూ- ‘చిన్న సినిమాలు అరుదుగా వస్తున్న సందర్భమిది. ఈ సినిమా మా రెగ్యులర్‌ కాంబినేషన్‌లోనే రూపొందుతోంది. హాస్యం, భావోద్వేగాలతో మంచి వినోదాన్నందిచే కథాంశంతో తెరకెక్కనుంది. టాటా బిర్లా.., అదిరిందయ్యా చంద్రం తరహాలో ఉంటుంది. శ్రీలేఖ సంగీతం ప్రధాన అస్సెట్‌’ అన్నారు. నిర్మాత తిరుపతిరావు మాట్లాడుతూ ‘వినోదం సహా కుటుంబ సెంటిమెంట్‌ మేళవించిన చిత్రమిది. యువదర్శకుడిని పరిచయం చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘10 సంవత్సరా లు సహాయదర్శకుడిగా, అసోసియేట్‌గా పనిచేసిన అనుభవముంది. తొలి అవకాశమిచ్చిన హీరో శివాజి, నిర్మాతలకు కృతజ్ఞతలు. మార్చి నెలాఖరున చిత్రీకరణ ప్రారంభించనున్నాం. సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తిచేసి, జూన్‌లో రిలీజ్‌ చేస్తాం’ అన్నారు. నిర్మాణ సారథి సోమా విజయ ప్రకాష్‌ మాట్లాడుతూ ‘శివా జితో12 సినిమాలు చేశాను. అన్నీ విజయం సాధిం చాయి. అదే కోవలో మంచి చిత్రమిది’ అన్నారు.