ఫిలిం న్యూస్
 
 
 
 
'బాడీగార్డ్' సక్సెస్ మీట్

వెంకటేష్, త్రిష జంటగా నటించిన చిత్రం బాడీగార్డ్. శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. గోపిచంద్ మలినుని దర్శకత్వం వహించారు. ఇటీవలె ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించి సక్సెస్ కి తొలిమెట్టు అయింది. ఈ ఆనందంతో నిర్మాత బెల్లం కొండ సురేష్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, వెంకటేష్, అలీ, గోపిచంద్, కోన వెంకట్ పాల్గొన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - భోగ భాగ్యాలతో భోగి రోజున విడుదలయి మా బాడీగార్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించి ఘనవిజయాన్ని సాధించడం చాలా హ్యాపీగా ఉంది. మేము వేసిన అంచనాలు ఎక్కడు కూడా తగ్గలేదు. మొదటిసారి ఇంత మంచి స్క్రిప్ట్ ని వెంకటేష్ బాబుతో మా బ్యానర్ పై నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. టెక్నిషియన్స్ శ్యామ్ కె నాయుడు ఫోటోగ్రఫీ సూపర్. కోనవెంకట్ మాటలు అదరగొట్టాయి. గోపిచంద్ కి మంచి లైఫ్ నిచ్చిందీ సినిమా. చాల కష్టపడి పని చేశాడు. ఫ్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ 18వ తేదీన వైజాగ్ లోని వి.మాక్స్ థియేటర్ లో జరపాలని నిశ్చయించాము. వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం.

అలీ మాట్లాడుతూ - బాడీగార్డ్ ని ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజతలు ఈ సినిమా తమిళ్, మళయాళ, హిందీలో మంచి సక్సెస్ ను సాధించింది. అన్నింటికన్నా తెలుగులో అద్బుతమైన సక్సెస్ సాధించడం గార్వకారణంగా ఉంది. కోనవెంకట్ మాటలు విరకొట్టాయి. ఈ సినిమాతో గోపి ఇండస్ట్రీలో ఆర్.ఎ.సి స్థానాన్ని పొందేశాడు అని అన్నారు.

గోపిచంద్ మాట్లాడుతూ - ఇంత పెద్ద సక్సెస్ నిచ్చిన ఆడియన్స్ కి మా యూనిట్ తరపున కృతజతలు తెలుపుతున్నాను. నన్ను ఈ అవకాశానిచ్చిని వెంకటేష్ మరియు సురేష్ గార్లకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సక్సెస్ నాకు చాలా ఆనందానచ్చింది అన్నారు.

వెంకటేష్ మాట్లాడుతూ - బాడీగార్డ్ సక్సెస్ చాలా ఆనందంగా ఉంది. అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభించింది. సల్మాన్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం చాలా యాంగ్జైటీగా ఎదురు చూశాడు. ఎమోషన్ సీన్స్ అన్ని నాకు బాగా నచ్చాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ని గోపి అద్భుతంగా చిత్రించాడు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కి యాక్షన్ జత చేయడం ఈ సక్సెస్ కి కారణమయ్యాయి. ప్రకాష్ రాజ్ అద్భుతమైన క్యారెక్టర్ చేశారు అని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ - ప్రపపంచవ్యాప్తంగా విడుదలైన మా బాడీగార్డ్ ఇంత సక్సెస్ ను సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలోని ఎమోషన్స్ సీన్స్ చిత్రించాలంటే చాలా అనుభవం కావాలి. గోపిచంద్ తనకున్న తక్కువ అనుభవంతో మెరుగైన అవుట్ పుట్ ను ఇచ్చాడు. విడుదలైన అన్నీ లాంగ్వేజస్ కన్నా తెలుగులోనే బాడీగార్ట్ పెద్ద హిట్ అయింది. చాలా ఆనందంగా ఉంది అన్నారు.

సాయి గణేష్ బ్యానర్ పై త్వరలోనే మరొక సినిమా ఉంటుందని స్క్రిప్ట్ప్ రెడీ అవుతున్నాయి అని వెంకటేష్ తెలిపారు. ఈ నెల 18 నుంచి వైజాగ్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ ఉంటుందని అన్నారు.