ఫిలిం న్యూస్
 
 
 
 
ఈశ్వరరెడ్డి 'బ్రమ్మిగాడి కథ'
‘‘ఇటీవల జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లను చూసినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఈ చిత్రం ప్రేక్షకులకు అదే ఫీలింగ్‌ని కలుగజేస్తుంది. ఇప్పటివరకు నేను చేసిన అన్ని చిత్రాలకన్నా ఈ చిత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది మంచి కమర్షియల్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరుణ్ సందేశ్. ఆయన హీరోగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మల్టిడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మిస్తున్న చిత్రం ‘బ్రమ్మిగాడి కథ’. అస్మితాసూద్, పూనమ్ కౌర్ నాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వరుణ్ పై విధంగా స్పందించారు. చిత్రనిర్మాత రజత్ పార్థసారధి మాట్లాడుతూ- ‘‘రోబో, సింహాలాంటి విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేశాం. నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి.. తొలి ప్రయత్నంగా లవ్, కామెడీ, సెంటిమెంట్ సమాహారంతో అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఈ చిత్రం తీశాం’’ అని చెప్పారు. ఈశ్వర్‌రెడ్డి చెబుతూ - ‘‘ఇటీవల డబ్బింగ్ చెప్పిన బ్రహ్మానందంగారు నిర్మాతకు ఫోన్ చేసి ‘సినిమా సూపర్ హిట్. జాక్‌పాట్ కొట్టారు’ అన్నారు. వరుణ్‌కి ఇది ‘ది బెస్ట్ ఫిలిం’ అవుతుంది. రెండు పాటలు, రెండు రోజుల టాకీ మినహా సినిమా పూర్తయ్యింది’ అన్నారు. ఇందులో మంచి పాత్ర చేశానని కృష్ణుడు అన్నారు. కోటి అందించిన పాటలు బాగున్నాయని, త్వరలో సినిమాని విడుదల చేస్తామని లైన్ ప్రొడ్యూసర్ ఇ.విజయ్‌కుమార్ రావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి, సమర్పణ: పి.రాంమోహన్‌రావు, కథ: పద్మశ్రీ.