ఫిలిం న్యూస్
 
 
 
 
‘బిజినెస్ మెన్’ ప్రారంభం

మహేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బిజినెస్‌మేన్‌’. కాజల్‌ కథానాయిక.పూరి జగన్నాథ్‌ దర్శకుడు. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై డావెంకట్‌ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రదినోత్సవ ఫర్వదినాన ఈ సినిమా సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై తొలిసన్నివేశాన్ని చిత్రీకరించారు. మహేష్‌ మాట్లాడుతూ ‘‘పూరితో ‘పోకిరి’ తర్వాత చేస్తున్న సంచలన చిత్రమిది. కథ విన్నప్పట్నుంచి చాలా ఉత్సుకతగా ఉన్నా. హీరో పాత్ర చిత్రణ అత్యద్భుతం. ఆర్‌.ఆర్‌ బేనర్‌లో సినిమా చేయడం చాలా సంతోషాన్నిస్తోంది. పూరితో నా కాంబినేషన్‌ను ఏ స్థాయిలో అంచనా వేస్తారో..అందుకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘పోకిరి లాంటి బ్లాక్‌బస్టర్‌నిచ్చాక..మరోసారి మహేష్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకోసం ప్రిన్స్‌ అభిమానులు సహా నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ కథాంశంపై చాలా నమ్మకంగా ఉన్నా. ఇంతవరకూ నేను చేసిన సినిమాలన్నిటిలో హీరో పాత్ర ది బెస్ట్‌ అనిపించేలా ఉంటుంది. ప్రేమ, యాక్షన్‌ ప్రధానాంశాలుగా ఉండే సినిమా ఇది. హీరో, దర్శకులను ఆకట్టుకునే గొప్ప నిర్మాత డావెంకట్‌. అలాంటి డైనమిక్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్‌ 1నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళతాం’ అన్నారు.

జనవరి 12 విడుదల
‘బిజినెస్‌మేన్‌’ వచ్చే సంక్రాంతికి మహేష్‌ అభిమానులకు, ప్రేక్షకులకు కానుకగా అందిస్తామని ..నిర్మాత డావెంకట్‌ అన్నారు. ప్రారంభోత్సవ వేళ మరిన్ని విశేషాలు ముచ్చటిస్తూ- ‘మా బేనర్‌లో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. మహేష్‌-పూరి అంటేనే క్రేజీ కాంబినేషన్‌. కథాంశం అద్భుతం.అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలనుకుం టున్నారో..మహేష్‌ అలాంటి పాత్రలోనే కనిపిస్తాడు. స్టైలిష్‌గా, లావిష్‌గా ఉన్నత సాం కేతిక విలువలతో రూపొందే చిత్రమిది. హీరో, దర్శకులపై పూర్తిస్థాయి నమ్మకముంది. అను కున్న ప్రకారం సినిమా పూర్తిచేసి జనవరి 12న విడుదల చేస్తాం. ఆర్‌.ఆర్‌ సంస్థ ఇమేజ్‌ పెంచే సినిమా ఇది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కెమెరా: శ్యామ్‌ కె.నాయుడు, కోడైరెక్టర్‌: విజయ్‌రామ్‌ప్రసాద్‌, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, కథ- కథనం- మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.