Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
వెంకటేష్‌ హీరోగా ‘చంద్రముఖి-2’
      విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రముఖ దర్శకుడు పి. వాసు దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కన్నడలో సెన్సేషనల్ హిట్ ‘ఆప్తరక్షక’ ఆధారంగా నిర్మిస్తున్న భారీ చిత్రం మేలో ప్రారంభం అవుతుంది. ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తోన్న బిగ్గెస్ట్ హిట్ ‘ఆప్తరక్షక’ తెలుగు రీమేక్ రైట్స్ కోసం ఎంతోమంది ప్రయత్నించినా బెల్లంకొండ సురేష్ ఈ రైట్స్ దక్కించుకున్నారు. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంపై ఎన్నో ఊహాగానాలు జరిగినా విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నట్టు బెల్లంకొండ సురేష్ ప్రకటించి సస్పెన్స్ కి తెరదించారు.

ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ- ‘‘చంద్రముఖి’ లాంటి సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత వాసు కన్నడంలో అందించిన ‘ఆప్తరక్షక’ సూపర్‌డూపర్‌ హిట్‌ అయి 40 కోట్లకుపైగా కలెక్ట్‌చేస్తూ కన్నడ చిత్రరంగంలో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించింది. ఈ చిత్రానికి తెలుగులో వెంకటేష్‌ హీరోగా వాసు దర్శకత్వంలో మా బేనర్‌లో నిర్మిస్తున్నాం. ‘ఆప్తరక్షక’ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా వుంటూ ఓ భిన్న కథాచిత్రంగా అందర్నీ అలరిస్తోంది. ఈ సబ్జెక్ట్‌ వెంకటేష్‌కు అద్భుతంగా ఉంటుంది. సినిమా చూసి ఎంతో ఇన్‌స్పైర్‌ అయి వెంకటేష్‌ నటిస్తానని చెప్పడం నాకెంతో ఆనందంగా వుంది. భారీ తారాగణంతో అతున్నత సాంకేతిక విలువలతో మా బేనర్‌లో ఓ ప్రెస్టీజియస్‌ మూవీగా మే నుంచి ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం’ అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com