హిందీలో ఘనవిజయం సాధించిన ‘దస్ వీదానియా’ సినిమాను తెలుగులో ఉషా ఫిలింస్ వారు తెలుగు భాషలో ‘చంద్రుడు’ పేర పునర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వివరాలను వెల్లడించడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో నిర్మాతలు పి.యస్.చంద్ర, రాజ్ కుమార్, దర్శకుడు ద్వారపూరి సత్యనారాయణ, కథానాయకుడు కృష్ణుడు పాల్గొన్నారు.
పి.యస్.చంద్ర మాట్లాడుతూ గత ఇరవై సంత్సరాలుగా సినిమా పరిశ్రమలో ఫోటోగ్రాఫర్ గా కొనసాగుతున్నాను. ఈ సినిమా చూశాను. చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ నాకు బాగా నచ్చింది. ఇంత మంచి సినిమా ద్వారా నిర్మాతగా మారడం ఆనందాన్ని కలిగించింది అన్నారు.
రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా కన్నడ, తమిళ్, మలయాళ రీమేక్ రైట్స్ మా వద్దనే ఉన్నాయి. ఒక గొప్ప సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం సాంకేతిక నిపుణులను నటీనటులను ఎన్నుకుంటున్నాము అన్నారు.
సత్యనారాయణ ద్వారపూడి మాట్లాడుతూ నేను ‘పెళ్ళికాని ప్రసాద్’సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాను. హిందీలో విజయవంతం సాధించిన ఈ సినిమాను తెలుగులో దాని కంటే బాగా ఉండేలా తీస్తాననే నమ్మకం నాకుంది అన్నారు.
కృష్ణుడు మాట్లాడుతూ ఈ సినిమా హిందీలో చూశాను. చాలా బాగా ఉంది. అంత మంచి సినిమాను తెలుగులో నన్ను పెట్టి తీయడం ఆనందాన్ని కలిగించింది అన్నారు.