Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
త్వరలో కళ్యాణి ‘చాప్టర్‌ 6’
     ప్రేమలోని ఆరు ఎమోషన్లని ఆరు అధ్యాయాలుగా తెరకెక్కించిన చిత్రం ‘చాప్టర్‌6’. సూర్యకిరణ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన సతీమణి, కథానాయిక కళ్యాణి నిర్మాత. పి.సి.శివన్‌ సంగీతం అందించారు. ఆగస్టు తొలివారంలో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సూర్యకిరణ్‌ మాట్లాడుతూ ‘సినిమా ప్రారంభంలో బెరుకుండేది. క్రమంగా అందరి సహకారంతో అది మాయమైంది. స్నేహితులు, సన్ని హితులు తమవంతు సాయం చేశారు. ‘సత్యం’తో ఇక్కడ నా జీవితం మొదలైంది. నిర్మాత అన్నిరకాలుగా సహక రించారు. ఈ సినిమాని ఆదరించి ప్రోత్సహించండి’ అన్నారు. కళ్యాణి మాట్లాడుతూ ‘కుటుంబ సమేతంగా చూసే సినిమా ఇది. పైరసీ సీడీలు చూడకుండా థియేటర్లలో మా సినిమాని చూసి ఆదరించండి’ అన్నారు. సురేష్‌ కొండేటి మాట్లాడుతూ ‘మంచి కథతో వస్తున్న సినిమా ఇది. సాంకేతికంగా ఉన్నతంగా మలిచారు’ అన్నారు. బాల కథా నాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కళ్యాణి, సోనియా సూరి కీలక పాత్రలు పోషించారు. చిత్రంలోని గీతాలు సంగీత దర్శకులు..ఆర్పీపట్నాయక్‌, దేవీశ్రీప్రసాద్‌, శ్రీలేఖ, చక్రి, పి.సి.శివన్‌ తలా ఒకటిచొప్పున పాడడం విశేషం.

తెలంగాణ శకుంతల, కోట శ్రీనివాసరావు, సుమన్‌ శెట్టి, కొండవలస, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కాదల్‌ దండపాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్ర్తి, కృష్ణచైతన్య, కందికొండ, బేనర్‌: మిడాస్‌ టచ్‌, కథనం-దర్శకత్వం: సూర్యకిరణ్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com