ఛార్మి జర్నలిస్టు పాత్రలో నటిస్తున్న సినిమా ‘నగరం నిద్రపోతున్న వేళ’. జగపతిబాబు కీలకపాత్రధారి. గురుదేవ క్రియేషన్స్ పతాకంపై నంది శ్రీహరి ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ప్రేమ్‌రాజ్ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత. ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా..చిత్రాలకు రచయితగా పనిచేసిన దీన్‌రాజ్ -కథను,
పరుచూరి బ్రదర్స్ -సంభాషణలు అందించారు. మేలో రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఛార్మి, జగపతిబాబు, పరుచూరి బ్రదర్స్, ధీన్‌రాజ్,
ప్రేమ్‌రాజ్, సంగీతదర్శకుడు యశోకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కథానాయిక ఛార్మి మాట్లాడుతూ -‘ ఎంతో సమాచారం జర్నలిస్ట్ వల్ల ప్రజలకు చేరుతుంది. ఈ సినిమాలో అలాంటి ఓ పాజిటివ్ జర్నలిస్టుగా నటిస్తున్నా. నా పాత్రకు
న్యాయం చేకూర్చానని భావిస్తున్నాను. ‘పౌర్ణమి’ తర్వాత ఈ సినిమాలో మరోసారి క్లాసికల్ డాన్స్ చేశాను. శివశంకర్ మాస్టర్ నృత్యాలు అందించారు. ప్రేక్షకులు నానుంచి
కోరుకున్న పాట అది. సన్నివేశాలు మంచి కాన్సెప్టుతో ఆసక్తికరంగా నడుస్తాయి’ అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ -‘సినిమాలో 5పాటలు హైలైట్. ఒక్కోపాట ఒక్కో వెరైటీతో అలరిస్తాయి. లిరిక్స్, ఛార్మి నటన హైలైట్’ అన్నారు.
దర్శకుడు ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ ‘టైటిల్‌లానే కథ ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రల చిత్రణ హైలైట్. ఛార్మి జాతీయ స్థాయి అవార్డ్ అందుకునే అర్హత ఉన్న నటి.
చాలా బాగా నటించారు. ఓ వారంలో మొత్తం చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చేనెలలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి మే లేదా జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’
అన్నారు.
పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ ‘నగరం నిద్రపోతున్న వేళ..మూడో కన్ను చూస్తూ ఉంటే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదే సినిమా. రాజకీయ దుష్టుల ఎటాక్
నుంచి చావుకి దగ్గరగా వెళ్లి బైటపడే పాత్ర ఛార్మిది. జగపతిబాబు అంతఃపురం తర్వాత ఆ స్థాయి పాత్ర చేశారు. క్లాస్ టచ్ ఉన్న మాస్ పాత్ర అది. సినిమా విజయం
సాధించాలి’ అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: లక్ష్మీనరసింహన్, కళ: రాజీవ్‌నాయర్, ఎడిటింగ్: మార్తాండ్.కె, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, అనంత శ్రీరాం, గోరెటి వెంకన్న,
సహనిర్మాత: టేకుల ముక్తిరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నంది నరహరి.