Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
"కలెక్టర్‌గారి భార్య" లోగో ఆవిష్కరణ
      ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రధారిగా అమోద్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. భూమిక కథానాయిక. టేకుల కృపాకర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.రాధికారెడ్డి, బి.వనితావాణి నిర్మాతలు. ఈ చిత్రానికి 'కలెక్టర్‌గారి భార్య' అనే పేరును ఖరారు చేశారు. టైటిల్‌ లోగోను ప్రకాష్‌రాజ్‌ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''దిల్‌ రాజు ద్వారా నాకు కృపాకర్‌రెడ్డి పరిచయమయ్యారు. సమాజానికి ఉపయోగపడే కథ ఇది. నేటి సమాజంలో మగవాళ్లు మహిళల్ని ఎలా చూస్తున్నారు? ఆలుమగల బంధం ఎలా ఉంది? లాంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఇలాంటి సినిమాలను నేను కూడా ఇష్టపడతాను'' అని పేర్కొన్నారు. ''ఆడపిల్లల తండ్రులకు, భర్తలకు మంచి సందేశాన్నిచ్చే సినిమా అవుతుంది. సినిమా చూసిన వారికి ఎవరికైనా నచ్చకపోతే టిక్కెట్‌ మొత్తాన్ని తిరిగిచ్చేస్తామ''ని దర్శకుడు అన్నారు. ''భార్యాభర్తల ఘర్షణ దేనికి దారి తీసిందని వివరించే సినిమా ఇది'' అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com