Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
అర్జున్ - చక్రవర్తిల ‘కాంట్రాక్ట్’
     అర్జున్, జె.డి.చక్రవర్తి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘కాంట్రాక్ట్’. సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.ఎస్.సమీర్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ మినీషా లాంబాను కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ నెల 15 నుంచి రెండో షెడ్యూల్ ను ఆరంభిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాత సమీర్ మట్లాడుతూ - ‘‘ఇది మక్కోణపు ప్రేమకథా చిత్రం. యాక్షన్ నేపధ్యంలో సాగుతుంది. ఈ చిత్ర కథ చెప్పగానే అర్జున్, జె.డి. ఎగ్జయిట్ అయ్యి, సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ ఇద్దరు పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. సినిమాలో ఎత్తుకి పై ఎత్తులు వేస్తుంటారు. అవి ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని ఇవ్వడంతోపాటు ఆసక్తికరంగా కూడా ఉంటాయి. వర్మ కార్పిరేషన్లో దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలుంటాయి. సుభాష్ - విశ్వాస్ సంగీత దర్శకులుగా పరిచయం అవుతున్నారు. పాటలు బాగా వచ్చాయి’’ అన్నారు. ఈ నెల 15 నుంచి 30 వరకూ హైదరాబాద్ లో షూటింగ్ చేసిన అనంతరం చెన్నై, మలేషియా, థాయిలాండ్ ల్లో కూడా షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, అలీ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : జానీలాల్, ఎడిటింగ్ : వెంకటేశ్, ఆర్ట్ : శంకర రెడ్డి, ఫైట్స్ : సెల్వ, సమర్పణ : శైలజా క్రియేషన్స్, కథ - స్క్రీన్ ప్లే - నిర్మాత - దర్శకత్వం : ఎస్.ఎస్.సమీర్.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com