ఫిలిమ్స్ పతాకంపై ఎస్.సునీత నిర్మిస్తున్న వైవిధ్యభరిత చిత్రం ‘క్రికెట్-గర్ల్‌స అండ్ బీర్’.
ఎస్.ఉమేష్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆదర్శ్, సూర్యతేజ్, నాగశౌర్య
కథానాయకులు. దర్శకుడు మాట్లాడుతూ ‘రెండు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న
నాకు సినిమా మేకింగ్ అంటే తొలినుంచీ ప్రాణం. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్
సినిమాల తీరుతెన్నుల్ని బాగా విశ్లేషించి అన్నివర్గాలూ మెచ్చే కథను సిద్ధం చేసుకుని ఈ
చిత్రాన్ని రూపొందించాను. ముగ్గురు సోదరుల చుట్టూ తిరిగే కథ ఇది. ఒకరికి క్రికెట్
అంటే ప్రాణం. ఇంకొకరికి గాళ్‌ఫ్రెండ్సే లోకం. మరొకరికి బీర్ లేకపోతే రోజు గడవదు.
వేరు వేరు దారుల్లో వెళుతున్న ఈ ముగ్గురి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకొస్తుంది ఓ
సంఘటన. అదే ఈ సినిమాలో హైలైట్.
అమెరికాలో స్థిరపడిన దాస్, శ్యామ్ లను సంగీత దర్శకులుగా పరిచయం చేస్తున్నాను.
నిర్మాత మాట్లాడుతూ ‘హ్యాపీడేస్, రైడ్, అప్పల్రాజు ..సినిమాల్లో నటించిన ఆదర్శ్
నిజంగానే మంచి క్రికెటర్. సూర్యతేజ్, నాగశౌర్య మరో కథానాయకులుగా
పరిచయమవుతున్నారు. వైజాగ్‌లో ఏకధాటి షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం.
జనవరిలో ఆడియో, అదేనెలలో సినిమా విడుదల చేస్తాం’ అన్నారు.