Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ఏప్రిల్ 23న ప్రభాస్ ‘డార్లింగ్’
      యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై ‘తొలిప్రేమ’ కరుణాకరన్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిం ‘డార్లింగ్’ షూటింగ్ పూర్తి అయింది.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ - ‘‘కరుణాకరన్ నాకు ఇష్టమైన డైరెక్టర్. ‘తొలిప్రేమ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ‘డార్లింగ్’ స్టోరీ నన్ను ఎంతగానో ఇన్ స్పైర్ చేసింది. లవ్ అండ్ యాక్షన్, మంచి ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఫీల్ అన్నీ వుండే మంచి సినిమా ‘డార్లింగ్’’ అన్నారు.

నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘డార్లింగ్’ కరుణాకరన్ స్టైల్ లో మంచి ఫీల్ వున్న సినిమా. ఇందులో లవ్ ఫీల్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ వున్నాయి. అన్నిరకాలుగా ఇది అందరికీ నచ్చుతుంది. లవ్ స్టోరీ అయినా కూడా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ అద్భుతంగా చేశాడు. కరుణాకరన్ ఎక్స్ ట్రార్డినరీగా తీశాడు. టేకింగ్ సైడ్ గానీ, మేకింగ్ సైడ్ గానీ రిచ్ గా వుంటుంది. లవ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ వుండడం వలన యూనివర్సల్ అప్లాజ్ వస్తుంది. ఒక పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయింది. డి.టి.ఎస్.మిక్సింగ్ జరుగుతోంది. ఫస్ట్ వీక్ లోనే ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ 23న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు.

దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ - ‘‘డార్లింగ్’ క్లాస్ గా కనిపించే మాస్ లవ్ స్టోరీ. మాస్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ప్రభాస్ పెర్ ఫార్మెన్స్ సూపర్. మేకింగ్ పరంగా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు కాంప్రమైజ్ అవకుండా తీశారు. నేను చాలా చాలా హ్యాపీ. జి.వి.ప్రకాష్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. చాలా హోం వర్క్ చేసి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. రీ-రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా కెమెరామెన్ ఆండ్రూని ఇంట్రడ్యూస్ చేశాను. అతనికి చాలా మంచి పేరు తెస్తుంది’’ అన్నారు.

ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, ఆహుతిప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, రాజా శ్రీధర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు ఫోషిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు : స్వామి, సంగీతం : జి.వి.ప్రకాష్, ఫోటోగ్రపీ : ఆండ్రూ, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : అశోక్, డాన్స్ : కళ్యాణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు : అనంత శ్రీరామ్, నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కరుణాకరన్.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com