యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై|| లిమిటెడ్ పతాకంపై 'తొలిప్రేమ' కరుణాకరన్ దర్శకత్వంలో 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిం 'డార్లింగ్' ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ - ''కరుణాకరన్ నాకు ఇష్టమైన డైరెక్టర్. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను. 'డార్లింగ్' స్టోరీ నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసింది. లవ్ అండ్ యాక్షన్, మంచి ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్మామిలీ ఫీల్ అన్నీ వుండే మంచి సినిమా 'డార్లింగ్'' అన్నారు.
నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ - ''డార్లింగ్' కరుణాకరన్ స్టైల్‌లో మంచి ఫీల్ వున్న సినిమా. ఇందులో లవ్ ఫీల్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ వున్నాయి. అన్ని రకాలుగా ఇది అందరికీ నచ్చుతుంది. లవ్‌స్టోరీ అయినా కూడా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ అద్భుతంగా చేశాడు. కరుణాకరన్ ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు. టేకింగ్ సైడ్‌గానీ, మేకింగ్ సైడ్‌గానీ రిచ్‌గా వుంటుంది. లవ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ వుండడం వలన యూనివర్సల్ అప్లాజ్ వస్తుంది. ఒక పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయింది. మార్చి నెలాఖరులో ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ 16 చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం'' అన్నారు.
దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ - ''డార్లింగ్' క్లాస్‌గా కనిపించే మాస్ లవ్ స్టోరీ. మాస్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ప్రభాస్ పెర్‌ఫార్మెన్స్ సూపర్. మేకింగ్‌పరంగా ప్రొడ్యూసర్ ప్రసాద్‌గారు కాంప్రమైజ్ అవకుండా తీశారు. నేను చాలా చాలా హ్యాపీ. జి.వి.ప్రకాష్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. చాలా హోం వర్క్ చేసి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. రీ-రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కెమెరామెన్ ఆండ్రూని ఇంట్రడ్యూస్ చేశాను. అతనికి చాలా మంచి పేరు తెస్తుంది'' అన్నారు.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, ఆహుతిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాస్ శ్రీను, రాజాశ్రీధర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు : స్వామి, సంగీతం : జి.వి.ప్రకాష్, ఫోటోగ్రఫీ : ఆండ్రూ, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : అశోక్, డాన్స్ : కళ్యాణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు : అనంత శ్రీరామ్, నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం : కరుణాకరన్.