ఫిలిం న్యూస్
 
 
 
 
ఆగస్ట్ 11న 'దడ' విడుదల
నాగచైతన్య- కాజల్ జంటగా అజయ్ భుయాన్ దర్శకత్వంలో శ్రీకామాక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ‘దడ’ సినిమా ఆగస్టు 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా అన్నపూర్ణా స్టూడియోలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డి.శివప్రసాద్ రెడ్డి, ఆర్.ఆర్.డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి భాస్కర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ- ‘ఈ సినిమా రెండుమూడు రోజుల టాకీ మినహా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లవర్ బాయ్ గా సక్సెస్ అయిన నాగచైతన్య... ఈ సినిమా ద్వారా మాస్ హీరోగా వస్తున్నాడు. ‘దడ’ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భాష తెలియని వారు కూడా బాగుంది అంటున్నారు. ఇది అమెరికా బ్యాక్ డ్రాప్ లో కథ, లవ్ విత్ యాక్షన్ తో రూపొందిన సినిమా. కథ పరంగా అమెరికాలో నివసించే తెలుగువాడి కథ. దర్శకుడు చాలా చక్కగా తీశాడు. ఈ సినిమాను ‘శివ’తో పోల్చలేము. ఖర్చుకు వెనకాడకుండా హైటెక్నిక్ తో తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతాన్ని అందించారు. ఆర్.ఆర్.ఫిలిమ్స్ ద్వారా మేమే సొంతగా ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నాము. 22న ఆడియో విడుదల చేయాలనుకుంటున్నాము’ అన్నారు.

ఆర్.ఆర్.డిస్ట్రిబ్యూటర్స్ తరఫున భాస్కర్ మాట్లాడుతూ- ‘ఈ సినిమాను ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయాలనుకుంటున్నాము. ఈ సినిమాను మాకు ఇచ్చిన శివప్రసాద్ రెడ్డి గారికి, నాగార్జునగారికి కృతజ్ఞతలు’ అన్నారు.

ఇతర పాత్రల్లో శ్రీరామ్, సమీక్ష, బ్రహ్మానందం, అలీ, రాహుల్ దేవ్, ముఖేష్ రిషి, కెల్లీ డార్జ్, తనికెళ్ళ భరణి, వేణుమాథవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్, ఇయాజ్ ఖాన్, కులదీప్, జునైద్ తదితరలు నటించగా, ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కథ : అజయ్ భుయాన్-శివ్ సింగ్, కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సహనిర్మాతలు : డి.చందన్ రెడ్డి, టి.కైలాష్ రెడ్డి, నిర్మాత శివప్రసాద్ రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ భుయాన్‌.