శ్రీరాం వేగరాజు దర్శకుడిగా ఛేజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్, సెవెన్ హిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా తెలుగు,
ఇంగ్లీషులో నిర్మించిన చిత్రం 'డిస్టెంట్ బీట్స్'. న్యూజెర్సీలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో రెండు
అవార్డులను ఈ సినిమా దక్కించుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు తెలియజేశారు. ఈ సినిమా సంగీత
ప్రధానంగా సాగుతుంది. నలుగురు యువతీ యువకుల మధ్య కథ నడుస్తుంది. ఇద్దరు అమెరికన్స్, ఇద్దరు
ఇండియన్స్ సంగీతాన్ని నమ్ముకుని ప్రయాణిస్తుంటారు. ఈ క్యారెక్టర్స్‌కు సంగీతం కన్నా జీవితం గొప్పది అనే
చెప్పే పెద్దవాడి పాత్రలో పి.జె.శర్మ నటించారు. మథర్ ధెరిస్సా ఆశయాలతో కూడిన సందేశం ఈ సినిమా ద్వారా
చెప్పాం. మంచి పాటలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది. ఈనెల 19న తెలుగులోపాటు
అమెరికాలోకూడా విడుదలచేస్తున్నాం' అన్నారు.
సంగీత దర్శకుడు పార్థసారథి మాట్లాడుతూ - 'గాయకుడిగా తెలుసు. సంగీత దర్శకునిగా పరిచయం
అవుతున్నా. మా కళాకారులకు సంబంధించిన కథ. అద్భుతమైన సందేశంతో ఈ సినిమాను రూపొందించారు.
క్లాసికల్ పాటలతో పాశ్చాత్య పాటలుకూడా ఉంటాయి' అని చెప్పారు.
నిర్మాత మాధురి మాట్లాడుతూ...'అందరూ సహకరించడంతో అనుకున్నట్టుగా చిత్రాన్ని పూర్తిచేశాం. అవార్డు
వచ్చిన సినిమాను విడుదల చేయాలని ఈనెల 19న విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.
పి.జె. శర్మ మాట్లాడుతూ - 'కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది. చాలా రోజుల తర్వాత మంచి పాత్ర
పోషించాను. అంతా కొత్తవారైనా చాలా ఉత్సాహంగా చేశారు. మంచి విలువలున్న చిత్రమిది. ఇలాంటి చిత్రాలు
ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శంకరాభరణం సోమయాజులు చేసిన పాత్రను ఇందులో నా చేత
చేయించారు' అని చెప్పారు.