'శఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్, యాక్షన్ ఇలా ఏ తరహా పాత్రలు చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అలరిస్తారు రవితేజ. తాజాగా రవితేజ
'డాన్ శీను'గా సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఛత్రపతి'
చిత్రం తర్వాత తెలుగు చిత్రాలకు దూరమైన శ్రియ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది.
అలాగే 'భగీరథ' తర్వాత రవితేజ, శ్రియ కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇటీవలే విదేశాల్లో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకొని
వచ్చిన ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ "45 రోజుల పాటు స్విట్జర్లాండ్, స్పెయిన్, దుబాయ్, బార్బిలోనా, ఐలాండ్‌ల్లో మూడు పాటలు,
కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. సినిమా చాలా బాగా వస్తోంది. 'కిక్' లాంటి విజయం తర్వాత మా బేనర్‌లో రవితేజతో 'డాన్ శీను'
చెయ్యడం చాలా ఆనందంగా వుంది' అన్నారు.
చిత్ర సమర్పకుడు కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ "జూన్ 6 నుంచి రాజమండ్రిలో పదిరోజుల పాటు షెడ్యూల్ జరగుతుంది. 'కిక్' తర్వాత ఆర్.ఆర్.మూవీ
మేకర్స్ సంస్థకు లభిస్తున్న మరో హిట్ చిత్రం ఇది' అని చెప్పారు. శ్రీహరి, సయాజీషిండే, బ్రహ్మానందం, అలీ, సునీల్, రఘుబాబు, కృష్ణభగవాన్, నాజర్
తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి మాటలు: కోన వెంకట్, ఎడిటర్: గౌతంరాజు, సంగీతం: మణిశర్మ, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి.