‘దొంగల ముఠా’ సినిమా షూటింగ్ మునుపే చెప్పినట్టుగా కేవలం ఐదు రోజుల్లో, కేవలం ఎనిమిది మంది క్ర్యూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తయ్యింది. అందరూ ఊహించుకున్నట్టుగా షూటింగ్ ఇరవై నాలుగు గంటల షెడ్యూల్ తో కాకుండా కేవలం సాధారణ పని గంటలలో, ఏ ఒక్క రోజు నిర్దేశించిన సమయం మించకుండా పూర్తి చేయడం జరిగింది. ఇంత వరకూ మొత్తం ఫిలిం ఇండస్ట్రీలోనే ఎవరూ ఊహించని విధంగా ఆలోచించి, దానికి ఈ విధంగా కార్యరూపం ఇవ్వడం సినిమా మేకింగ్ లోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాంది.
నాలుగు కెనాన్ కెమెరాలను ఉపయోగించి, ఒకేసారి నాలుగు ఆంగిల్స్ లో ప్రతీ షాట్ తీయడం వల్ల అత్యంత వేగంగా షూట్ చేయడం సాధ్యపడింది. అసలు లైట్స్ మరియు డాలి, జిబ్ మొదలగు ఎక్విప్‍మెంట్స్ ఉపయోగించకుంగా సినిమా మొత్తం సహజమైన లైటింగ్ లో చేయడం జరిగింది.
రవితేజ, చార్మి, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, బ్రహ్మాజి మరియు సుప్రిత్ మొదలగు వారున్న ఈ సినిమాను ఇండస్టీలోనే మొదటి సారిగా జీరో బడ్జెట్ (ఒక్క రూపాయి కూడా ఖర్చులేకుండా)తో నిర్మించడం జగిరింది. యాక్టర్లకు గాని, టెక్నీషియన్లకు ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వబడలేదు. సినిమా రిలీజైన తర్వాత వచ్చే లాభాలతో మాత్రమే వాళ్ళకు రెమ్యునరేషన్ ఇవ్వబడుతుంది.
మొత్తం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటూ మార్చి 4, 2011న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అంటే కేవలం సినిమా ప్రారంభించిన రోజు నుండి 23 రోజుల్లోపే. దొంగల ముఠా లోని “ముఠా మెంబర్ల” ప్రొడక్షన్ స్టిల్స్ ని ఈ సందర్భంలో ఇలా రిలీజ్ చేస్తున్నాము.