‘డాన్‌శీను’ సినిమా వారం రోజులు పూర్తిచేసుకుని విజయవంతంగా ముందుకెళుతున్న సం దర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సహ నిర్మాత వి.సురేష్‌రెడ్డి, చిత్ర సమర్పకులు కె.అచ్చిరెడ్డి, దర్శకుడు గోపీ చంద్ మలినేని, రెండో హీరోయిన్ అంజనా సుఖాని పాల్గొని.. చిత్రం సాధిస్తున్న సంచలన విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తంచేసారు.
ఈ సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ‘తొలి నాలుగు రోజుల్లోనే రూ.8కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించాడు ‘డాన్‌శీను’. ‘కిక్’ కంటే పెద్ద విజయమిది. రవితేజ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్! మా సినిమాని ఆదరిస్తున్న కుటుంబ ప్రేక్షకులకి ధన్యవాదాలు. హీరో పాత్ర చిత్రణ, శ్రీహరి పవర్‌రోల్, బ్రహ్మానందం, ఆలీ కామెడీ..బాగా కలిసొచ్చాయి. కోనవెంకట్ పంచ్ డైలాగులకు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ సంగీతానికి తగినట్టుగానే పాటలు తెరపై నిండుగా పరుచుకున్నాయి. ఈ సినిమాలోని ఫైట్స్‌ను కూడా కుటుంబ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. రవితేజ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలో అద్భుతంగా నటించారు. శ్రీయ, అంజనా సుఖానీ గ్లామర్ మరింత కలిసొచ్చింది. ఇలాగే నడిపించి 100రోజులకు చేరువ చేయండి’ అన్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ- ‘చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన సీనియర్ దర్శకుడిలా ఈ సినిమాను తీసావంటూ కాంప్లిమెంట్స్ వచ్చాయి. అవకాశమిచ్చిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్‌వారికి, రవితేజాగారికి కృతజ్ఞతలు’ అన్నారు.
సహనిర్మాత సురేష్‌రెడ్డి మాట్లాడుతూ-‘ప్రారంభం నుంచి స్థిరంగా వసూళ్లు వస్తున్నాయని, తాము ముందు నుంచీ చెబుతున్నట్లుగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ వేల్యూను ‘డాన్‌శీను’ చిత్రం మరింత పెంచిందని’ అన్నారు. తన ఆరంభాన్ని తెలుగు ప్రేక్షకులు బాగానే స్వీకరించారని కథానాయిక అంజనాసుఖాని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు ఏచూరి చలపతిరావుకి రూ.50వేల చెక్కును ఆర్థికసాయంగా అందించారు.
‘ఆర్.ఆర్’కు ఆజన్మాంతం రుణపడి ఉంటాను!
భార్యాపిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉన్న తనను ఆర్థిక సాయంతో ఆదుకున్నందుకు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు నటుడు ఏచూరి. ‘డాన్ శీను’ చిత్రం విడుదల సందర్భంగా తనలాంటి పేద కళాకారుల్ని ఆదుకోవడానికి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ రూ.10 లక్షలు కేటాయించడం గొప్ప విషయమని, ప్రతి సినిమాకి వారు ఇలాంటివి చేస్తున్నారని ఆయన అన్నారు. 890 సినిమాల్లో నటించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుతో బాధపడుతున్న తనకు ఆర్.ఆర్‌వారు అందించిన సహాయాన్ని జీవితాంతం మరువలేనని ఏచూరి అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్, సమర్పకులు అచ్చిరెడ్డి, సహనిర్మాత సురేష్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.