ఫిలిం న్యూస్
 
 
 
 
‘దూకుడు’ 100 రోజులు

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో జి.రమేష్‌బాబు సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన 'దూకుడు' చిత్రం 80 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో నెంబర్‌ వన్‌ గ్రాసర్‌గా నిలిచి డిసెంబర్‌ 31కి 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ - '''దూకుడు' ప్రేక్షకులు, అభిమానుల ఆదరణతో రికార్డులు సృష్టించింది. 'దూకుడు'లాంటి బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన 2011ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నగారు 'దూకుడు' చూడగానే 80 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రను తిరగ రాస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగినందుకు చాలా ఆనందంగా వుంది. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా శ్రీను వైట్ల గారికి చెందుతుంది. నా కెరీర్‌లో బెస్ట్‌ ప్రొడ్యూసర్స్‌ రామ్‌, గోపీ, అనీల్‌గార్లకు థాంక్స్‌. మళ్ళీ ఈ ప్రొడ్యూసర్స్‌తో ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నాను. 'దూకుడు'లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన శ్రీను వైట్లకి స్పెషల్‌ థాంక్స్‌. అలాగే 14 రీల్స్‌ ఎంటర్‌టైనమెంట్‌ యూనిట్‌కి నా కృతజ్ఞతలు'' అన్నారు.

దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ - ''సూపర్‌స్టార్‌ కృష్ణగారికి అభిమానిని అయిన నేను సూపర్‌స్టార్‌ మహేష్‌తో 'దూకుడు'లాంటి ఆల్‌టైమ్‌ ఇండిస్టీ హిట్‌ చేసినందుకు ఎంతో ఆనందంగా వుంది. ఈ నిర్మాతలు రామ్‌, గోపీ, అనీల్‌ నా ఫ్రెండ్స్‌. 'దూకుడు'లాంటి సెన్సేషనల్‌ హిట్‌కి నా ఫ్రెండ్స్‌ నిర్మాతలవడం మరింత ఆనందాన్ని కలిగించింది. మహేష్‌బాబుతో 'దూకుడు'ని మించిన సినిమాని తియ్యాలని వుంది. మళ్ళీ మళ్ళీ మహేష్‌తో కలిసి వర్క్‌ చెయ్యాలని వుంది. 2011కు గుడ్‌బై చెబుతూ 2012కి స్వాగతం చెబుతూ మా 'దూకుడు' 100 రోజులు పూర్తి చేసుకోవడం మా టీమ్‌ అందరికీ చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

నిర్మాతలు రామ్‌, గోపీ, అనీల్‌ మాట్లాడుతూ - ''80 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో నెంబర్‌ 1 గ్రాసర్‌గా 'దూకుడు'ని నిలబెట్టిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్‌ చెబుతున్నాం. మహేష్‌బాబులాంటి సూపర్‌స్టార్‌తో 'దూకుడు'లాంటి రికార్డ్‌ బ్రేకింగ్‌ హిట్‌ తీసినందుకు నిర్మాతలుగా మాకెంతో ఆనందంగా వుంది. ఇంతటి సంచలన విజయాన్ని ఇచ్చిన మా మిత్రులు, దర్శకులు శ్రీను వైట్లగారికి థాంక్స్‌. రెండో సినిమాకే 'దూకుడు'లాంటి బ్లాక్‌బస్టర్‌ చేసే అవకాశం ఇచ్చిన మా మహేష్‌బాబుగారికి థాంక్స్‌. 'దూకుడు'ని అపూర్వంగా ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు'' అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కోటి మాట్లాడుతూ - ''దూకుడు'లాంటి ఇండిస్టీ హిట్‌కి పగలనక, రాత్రనక హార్డ్‌వర్క్‌ చేసిన 14 రీల్స్‌ యూనిట్‌ మెంబర్స్‌ అందరికీ పేరుపేరునా థ్యాంక్స్‌ చెబుతున్నాం'' అన్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, సమంత జంటగా నటించిన 'దూకుడు' చిత్రానికి గోపీమోహన్‌, కోన వెంకట్‌, థమన్‌ ఎస్‌., కె.వి.గుహన్‌, ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎం.ఆర్‌.వర్మ, దినేష్‌, రాజుసుందరం, రామ్‌లక్ష్మణ్‌, విజరు, కోటి సాంకేతిక నిపుణులు.