మంచు విష్ణువర్థన్‌బాబు, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం
గురువారం ఉదయం హైదరాబాద్‌కు సమీపంలోని గచ్చిబౌలిలో ప్రారంభమైంది. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో
రూపొందుతున్న ఈ చిత్రం ముహూర్తపు షాట్‌ను విష్ణుపై చిత్రీకరించారు. ఈ తొలి దృశ్యానికి రచయిత గోపీమోహన్
కెమెరా స్విచాన్ చేయగా, విష్ణు సోదరుడు మనోజ్ క్లాప్ కొట్టారు.
ఎంతో నిరాడంబరంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో డా.మోహన్‌బాబు, శ్రీమతి నిర్మల, కోన వెంకట్, బీవీఎస్వ్రి,
మరుధూరి రాజా, చక్రి వంటి సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. హీరోగా నటిస్తూ
విష్ణువర్థన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఆద్యంతం వినోదభరితంగా ఈ చిత్రం రూపొందుతుందని, ‘ఢీ’
తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన కెరీర్‌లో నిలుస్తుందని విష్ణు తెలిపారు.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి,
ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక
పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు,
సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు.