Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ప్రభాస్ 'ఏక్ నిరంజన్'
     ఇటీవలే ఈ చిత్రం థాయ్‌లాండ్‌లో 35 రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ప్రభాస్‌ను 'బుజ్జిగాడు'గా ఓ వైవిధ్యమైన కోణంలో చూపించిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఇప్పుడు ఆయన్ని 'ఏక్‌నిరంజన్‌'గా చూపెట్టే ప్రయత్నంలో వున్నారు. ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ కంగనారనౌత్‌ కథానాయికగా చేస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్యరామ్‌ మూవీస్‌ పతాకంపై ఆదిత్యరామ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం థాయ్‌లాండ్‌లో 35 రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - "ప్రభాస్‌ శారీరక భాష, ఇమేజ్‌కు తగ్గట్లుగా పూరి జగన్నాథ్‌ ఓ మంచికథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థాయ్‌లాండ్‌, బ్యాంకాక్‌, పట్టాయ్‌లలోని పలు సుందర ప్రదేశాల్లో ఇటీవలే ఓ షెడ్యూల్‌ని పూర్తిచేసాం. అక్కడ చిత్రీకరించిన పతాక సన్నివేశాలు, పోరాట దృశ్యాలు చిత్రానికి హైలైట్‌గా వుంటాయి. ఆ దృశ్యాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. థాయ్‌లాండ్‌ ఫైటర్సు, యూరోపియన్‌ ఫైటర్స్‌ పాల్గొనగా తీసిన ఆ దృశ్యాలు తెలుగు సినిమాల్లో ఇంతవరకూ చూడని విధంగా ఉంటాయి.

ముఖ్యంగా హీరోతోపాటు జిమ్నాస్టిక్స్‌ విద్యలో పేరొందిన కొంతమంది ఫైటర్స్‌ చేసిన దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి. వారిలో జాకీచాన్‌తో కొన్ని చిత్రాల్లో సోలో ఫైట్‌ చేసిన వ్యక్తి పెర్‌ఫార్మెన్స్‌ ప్రత్యేకించి చెప్పుకోదగినది. ఆ సీన్స్‌లో ప్రభాస్‌, కంగనారనౌత్‌, సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, బ్రహ్మాజి తదితరులు పాల్గొన్నారు' అని చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న వర్క్‌ గురించి ఆదిత్యారామ్‌ మాట్లాడుతూ -"ఆగస్ట్‌ 16 నుంచి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ చేస్తున్నాం. సెప్టెంబరు 15 వరకు ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది. ఈ నెలలోనే ఆడియోను విడుదల చేసి, అక్టోబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం. ప్రభాస్‌ నటన, కంగనా అభినయం ప్లస్‌ గ్లామర్‌ చిత్రానికి అదనపు వన్నెను తెస్తాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను' అన్నారు.

సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, మకరన్‌దేశ్‌పాండే, బ్రహ్మానందం, అలీ, సునీల్‌, వేణుమాధవ్‌, బ్రహ్మాజి, తనికెళ్ళభరణి, సంగీతం, పోసాని కృష్ణమురళి, సత్యప్రకాష్‌, శ్రావణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: శ్యామ్‌.కె.నాయుడు, సమర్పణ: పూరి జగన్నాథ్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com