మన దేశం మూవీస్ పతాకంపై గౌతం మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘నడి నుసి నాయిగళ్’ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘ఎర్ర గులాబీలు’ పేరుతో అశోక్ వల్లభనేని అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రోమో లాంఛింగ్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర తమిళ నిర్మాతలు మదన్, కుమార్, డి.రామానాయుడు, శ్రీకాంత్, చంద్రసిద్దార్థ, ధరణి, ఎడిషనల్ డి.జి.పి ఆర్.పి.మీనా, సమీరారెడ్డి, గౌతం మీనన్, ఈ చిత్రంలో నటించిన మహేశ్వరి సోదరుడు కార్తిక్, వీర, నిర్మాత అశోక్ వల్లభనేని పాల్గొన్నారు.
గౌతంమీనన్ మాట్లాడుతూ - సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇందులో పాటలకు అవకాశం లేదు. మొత్తం సినిమా రాత్రి వేళలో జరుగుతుంది. సమీరా రెడ్డి ఈ చిత్రంలో నాయిక. ప్రేక్షకులను ఆశ్చర్చపరిచే విధంగా సమంత ఈ చిత్రంలో రెండు నిముషాలు కనిపిస్తుంది. ఇందులో నటించిన కార్తీక్, వార గతంలో నా దగ్గర టెక్నీకల్ విభాగంలో పని చేశారు. ఉత్సాహవంతుడైన అశోక్ వల్లభనేని ద్వారా ఈ చిత్రం తెలుగులో విడుదల కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రం జనవరి చివరి వారంలో విడుదలవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అయిదుగురు పేద విద్యార్థులకు నిర్మాత ఆర్థిక సహకారాన్ని అందించారు. |