"ఏడాది క్రితం జగపతిబాబు 'గాయం' సీక్వెల్ గురించి చెప్పాడు. నాకెందుకో అది కరెక్ట్ అనిపించలేదు. వద్దని
వారించాను. 'గాయం'కు సీక్వెల్ ఎవరుచూస్తారయ్యా... నేను చేసిన సినిమా నాకే గుర్తులేదు. ఇక
జనాలకు ఏం గుర్తుంటుంది..' అని నిరుత్సాహపరిచాను. కానీ జగపతి మాత్రం తన నిర్ణయాన్ని
మార్చుకోలేదు. ఓ రోజు దర్శకుడు ప్రవీణ్‌శ్రీని తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. అతను చెప్పిన కథ బాగా ఇంప్రెస్
చేసింది. 'దుర్గ' పాత్రను అతను మలచిన తీరు నిజంగా అభినందనీయం.
'గాయం'కు ఇది పర్‌ఫెక్ట్ సీక్వెల్. ఓ హిట్ సినిమాకు సమర్పకుడుగా వుండటం చాలా ఆనందంగా ఉంది' అని
రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ఆయన సమర్పణలో, జగపతిబాబు కథానాయకుడిగా, ప్రవీణ్‌శ్రీ దర్శకత్వంలో
రూపొందిన చిత్రం 'గాయం-2'. రామ్‌గోపాల్‌వర్మ 'గాయం' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి
నిర్మాత డా.ధర్మకర్త ఈ సినిమా విశేషాలను విలేకరులకు తెలిపారు.
జగపతిబాబు మాట్లాడుతూ -"ముందుగా 'గాయం' కథను వాడుకోవడానికి అనుమతినిచ్చిన
ఎస్.ఎస్.క్రియేషన్స్‌వారికి, సినిమా నిర్మాణంలో ఆద్యంతం తన సహకారాన్నిచ్చిన మిత్రుడు జేడీ చక్రవర్తికి నా
కృతజ్ఞతలు. 'గాయం' విడుదలై 17ఏళ్లు కావొస్తోంది. కానీ నేటికీ ఆ సినిమాను ఎవ్వరూ మరచిపోలేదు.
నన్ను హీరోగా నిలబెట్టిన సినిమా 'గాయం'.
హాలీవుడ్‌లో రూపొందిన 'గాడ్‌ఫాదర్' ఆధారంగా వర్మ ఈ సినిమా తీశారు. ఇప్పటికీ చాలామంది న న్ను
'గాయం' గురించే అడుగుతుంటారు..
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే.. 'అన్నయ్యా... నువ్వు 'గాయం' లాంటి సినిమా చేస్తే చూడాలని
ఉంది' అని ఎదురైన ప్రతిసారీ అడుగుతుంటాడు. అంతగా అందరిలో చొచ్చుకుపోయిన సినిమా అది. ఈ
విషయమే వర్మకు చెప్పాను.
ముందు నిరుత్సాహపరిచారు. కథ విన్నాక ఎంతో అభినందించారు. ప్రవీణ్‌శ్రీ ఈ సినిమాను తీస్తున్నప్పుడు వర్మను
కాస్తయినా రీచ్ అవుతాడా.. అనుకున్నా. కానీ సినిమా చూసిన తరువాత అభినందించకుండా
ఉండలేకపోతున్నా. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. మళ్లీ 'గాయం-2' నాకు రీ-బర్త్
అవుతుందని నమ్మకం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం' అని చెప్పారు.
సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని లైన్ ప్రొడ్యూసర్ భరత్ చౌదరి తెలిపారు.
తనికెళ్ల భరణి, విమలారామన్, అనిల్ బండారి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.