జగపతిబాబు, విమలారామన్ జంటగా ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో కర్తక్రియేషన్స్ పతాకంపై డా.ధర్మకర్త సి.
నిర్మిస్తున్న చిత్రం 'గాయం-2'. ఈ చిత్రాన్ని రామ్‌గోపాల్‌వర్మ సమర్పిస్తున్నారు.
చిత్రం దర్శకుడు ప్రవీణ్‌శ్రీ మాట్లాడుతూ-
‘జగపతిబాబు కెరీర్‌ను మలుపుతిప్పిన ‘గాయం’ చిత్రానికి ఫర్‌ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇండియాలో ఈ తరహాలో
సీక్వెల్ ఎవరూ చేయలేదు. మా గురువుగారు ఈ చిత్రానికి సమర్పకునిగా ఉండడం నా అదృష్టం' అన్నారు.
నిర్మాత ధర్మకర్త మాట్లాడుతూ- ‘కొత్త తరహాలో ఉండే యాక్షన్ చిత్రమిది. ఇళయరాజా సంగీతం ప్రధాన
ఆకర్షణగా ఉంటుంది. ఐదు పాటలుంటాయి. భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, వనమాలి, కలువ కృష్ణసాయి రాశారు.
ఇప్పటికే ఈ పాటల రికార్డింగ్ పూర్తయింది. మా కోరిక మేరకు ఓ పాటను ఇళయరాజా పాడడం విశేషం'
అన్నారు.
ఈ చిత్ర లైన్‌ప్రొడ్యూసర్ భరత్ మాట్లాడుతూ, ఇటీవలే బ్యాంకాక్‌లో 20రోజులు షెడ్యూల్ చేశాం.
యాక్షన్ ఎపిసోడ్‌తోపాటు జగపతిబాబు, విమలారామన్‌పై రెండు పాటలు చిత్రీకరించాం. జగపతిబాబు,
విమలారామన్, కోట, భరణి తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మే 3 నుంచి హైదరాబాద్ పరిసరాల్లో
రెండో షెడ్యూల్ చేయబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, మాటలు: గంధం నాగరాజు, ఎడిటింగ్ : ప్రవీణ్, స్ర్కీన్ ప్లే : రాజేంద్రరెడ్డి, ఆర్ట్: ధర్మేంద్ర.