ఫిలిం న్యూస్
 
 
 
 
‘‘గబ్బర్ సింగ్’’
పవన్‌కళ్యాణ్‌ హీరోగా తనే నిర్మాతగా పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్ పతాకంపై రూపొందిస్తున్న భారీ చిత్రానికి ‘గబ్బర్‌సింగ్‌’ అనే పేరు నిర్ణయించారు. హిందీలో సంచలన విజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న ఈ చిత్రానికి ‘మిరపకాయ్‌’తో హిట్‌ కొట్టిన హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్ బేనర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది. హిందీ సూపర్‌హిట్‌ ‘దబాంగ్‌’ ఆధారంగా చేస్తున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గబ్బర్‌సింగ్‌గా నటిస్తున్నాను. హరీష్‌ శంకర్‌తో గతంలోనే ఓ సినిమా చేయాల్సి ఉంది. అప్పుడు మిరపకాయ్‌ స్టోరీతో పాటు మరికొన్ని కథలు చెప్పాడు. కథ చెప్పేటప్పుడు హరీ‌ష్‌ నేరేషన్‌ నాకెంతో నచ్చింది. దబాంగ్‌ రీమేక్‌ అనుకోగానే హరీష్‌ అయితేనే ఈ సినిమాకి కరెక్ట్‌ అనిపించింది. అతి త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంలోనే రిలీజవుతుంది’ అన్నారు.

ఉన్నత సాంకేతిక విలువలతో అభిమానులు, ప్రేక్షకులను అలరించే ఈ భారీ కమర్షియల్‌ చిత్రానికి నిర్మాత: పవన్‌కళ్యాణ్‌, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.