పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్‌శంకర్ దర్శకత్వంలో గణేష్‌బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్‌సింగ్'. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'తీన్‌మార్' వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన నటుడు గణేష్‌బాబు మళ్ళీ పవన్‌కళ్యాణ్ హీరోగా 'గబ్బర్‌సింగ్' అనే ప్రెస్టీజియస్ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నిర్మాతగా గణేష్‌బాబు మీద వున్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ వెంటనే మళ్ళీ ఈ బేనర్‌కి డేట్స్ ఇవ్వడం విశేషం.
ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్‌బాబు మాట్లాడుతూ - ''నామీద అభిమానంతో వెనువెంటనే మా బేనర్‌లో రెండో సినిమాకి డేట్స్ ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌గారికి జీవితాంతం కృతజ్ఞుడిగా వుంటాను. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌గారితో వెంట వెంటనే రెండు సినిమాలు తీసే అవకాశం దక్కినందుకు నిర్మాతగా నాకెంతో సంతోషంగా వుంది. నిజంగా పవన్‌కళ్యాణ్‌గారు ఎంతో గ్రేట్. నిర్మాతగా నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన కళ్యాణ్‌బాబుకి హ్యాట్సాఫ్. హిందీలో సెన్సేషనల్ హిట్ అయిన 'దబాంగ్' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో చాలా పెద్ద లెవల్‌లో తీస్తున్నాం. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే అంశాలతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'గబ్బర్‌సింగ్' రూపొందుతుంది. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభించే ఈ చిత్రానికి 'జల్సా' తర్వాత యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఓ ప్రముఖ హీరోయిన్ కధానాయికగా నటిస్తుంది. భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసాం. మిరపకాయ్ వంటి సూపర్‌హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ 'గబ్బర్‌సింగ్' చిత్రాన్ని సెన్సేషనల్ హిట్ అయ్యేలా తియ్యడానికి సర్వసన్నాహాలు చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుతుంది'' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్.