తమిళంలో హీరో అజిత్ రీసెంట్ హిట్ ‘మంగాత్తా’. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట రికార్డు
కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను ‘గ్యాంబ్లర్’ పేరుతో తెలుగులోకి అనువదించారు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఈ
నెల 9న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను తెలుపడానికి ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో బెల్లంకొండ మాట్లాడుతూ- ‘‘అజిత్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘బిల్లా’ చిత్ర రికార్డులన్నింటినీ
అధిగమించే దశగా దూసుకుపోతున్న చిత్రం ‘మంగాత్తా’. క్రికెట్ బెట్టింగ్స్ నేపథ్యంలో సాగే సినిమా ఇది.
ప్రేమ, సెంటిమెంట్ లాంటి వాటికి ఈ కథలో ప్రాధ్యానత తక్కువ. పూర్తి యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలోనే సినిమా
అంతా సాగుతుంది. ఒక హాలీవుడ్ సినిమాను చూసిన అనుభూతికి లోను చేస్తుందీ సినిమా. అంత గొప్పగా దర్శకుడు
వెంకట్‌ప్రభు ఈ చిత్రాన్ని మలిచాడు. యాక్షన్ కింగ్ అర్జున్ నిజాయితీ గల పోలీస్ అధికారిగా ఇందులో ఓ ప్రత్యేక పాత్ర
పోషించారు. త్రిష ఇందులో కథానాయిక. ఆమె గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. యువన్‌శంకర్‌రాజా అందించిన
సంగీతం తమిళనాట పెద్ద హిట్. ఈ నెల 9న సినిమాను విడుదల చేసి, ఆ తర్వాత రెండు రోజులకు పాటలను విడుదల
చేస్తాం.
మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో 225 థియేటర్లలో గ్రాండ్‌గా సినిమాను విడుదల చేస్తున్నాం. ఏ సినిమా
అయినా నేను నచ్చితేనే తీసుకుంటాను. నచ్చకపోతే ఆ సినిమా గురించి కూడా ఆలోచించను. ఇది నా మనసుకు నచ్చిన
సినిమా. కాంచన, కందిరీగ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని
నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపారు. వైభవ్, లక్ష్మీరాయ్, ఆండ్రియా, అంజలి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ
చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, నిర్మాణం: సాయిగణేశ్ ప్రొడక్షన్స్.