ఫిలిం న్యూస్
 
 
 
 
అర్థవంతమైన 'గంగపుత్రులు'
కె.బి.ఆర్. ప్రొడక్షన్స్, శ్రావ్య ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గంగపుత్రులు'. సుబ్బరాజు, గాయత్రీరావు, రామ్‌కీ, తన్మయి, మహేష్ కీలక పాత్రధారులు. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రయూనిట్ బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.

దర్శకుడు మాట్లాడుతూ- "సందేశంతో పాటు ఎన్నో అంశాలున్న సినిమా ఇది. కాంటెంపరరీ విషయాలను, సెన్సిటివ్ అంశాలను ఇందులో పొందుపరచాం. వినోదంతో పాటు చక్కటి ప్రేమ కథ అంతర్లీనంగా సాగుతుంది. పుణె ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీలుగా పనిచేసిన వారు ఈ సినిమాకు సాంకేతిక నిపుణులుగా వ్యవహరించారు. గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. ఎన్నో గ్రామాలకు స్వయంగా వెళ్లి పరిశీలించిన అంశాలను ఈ కథలో పొందుపరచాం'' అని అన్నారు.

నిర్మాతలు కె.బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ- "మార్చి 8న మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా పాటలను విడుదల చేస్తాం. ఈ నెల మూడో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. సునీల్ చాలా బాగా తెరకెక్కించారు. అర్థవంతమైన చిత్రం. దేశానికి, భవిష్యత్తుకు ఇలాంటి సినిమాలు ఎంతో అవసరం'' అని చెప్పారు. రామ్‌కీ, తన్మయి, మహేష్ తమ పాత్రల గురించి వెల్లడించారు.

సముద్రం వెంకటేష్, భీమిలి రజనీ, రావు రమేష్, ఎల్బీ శ్రీరామ్, గుండు సుదర్శన్, జీవా, జెన్నీ, రాళ్ళపల్లి, కళ్ళు చిదంబరం తదితరులు ఇతర పాత్రధారులు. కెమెరా: సాబు జేమ్స్, కూర్పు: శ్రీగుహ, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఆడియోగ్రాఫర్: జి.హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కుర్రా విజయ్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: పి.సునీల్‌కుమార్‌రెడ్డి.