Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
జగపతిబాబు 'గాయం-2' ‌‌
     జగపతిబాబు కెరీర్‌ను మలుపు తిప్పిన 'గాయం' చిత్రానికి 'గాయం-2' సీక్వెల్‌ రానుంది. 'గాయం-2' పేరుతో కర్త క్రియేషన్స్‌ పతాకంపై డా.ధర్మకర్త.సి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రవీణ్‌శ్రీ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఇందులో జగపతిబాబు సరసన విమలారామన్‌ కథానాయికగా ఎంపికయ్యారు. నిర్మాత డా.ధర్మకర్త మాట్లాడుతూ -"1993లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'గాయం' జగపతిబాబుకు యాక్షన్‌ హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్‌ చేసే అవకాశం రావడంతో చాలా ఆనందంగా ఉంది. ఇది పర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌. ఇండియాలో ఇప్పటి వరకూ ఈ తరహాలో ఎవరూ చేయలేదు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన ప్రవీణ్‌శ్రీ చాలా ఇన్నోవేటివ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

హీరో జగపతిబాబు ఈ చిత్రానికి సమర్పకులుగా కూడా వ్యవహరిస్తున్నారు' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -"ఇళయరాజా స్వరసారథ్యంలో ఆరు పాటలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 25 నుంచి విదేశాల్లో 20 రోజులు షూట్‌ చేయబోతున్నాం. యాక్షన్‌ ఎపిసోడ్‌, కీలక సన్నివేశాలతోపాటు 2 పాటలను అక్కడ చిత్రీకరిస్తాం. తర్వాత హైదరాబాద్‌, వైజాగ్‌ల్లో షెడ్యూల్స్‌ చేస్తాం' అని చెప్పారు.

కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, కోట ప్రసాద్‌ తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. కెమెరా: అనిల్‌ భండారి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌, మాటలు: గంధం నాగరాజు, పాటలు: భాస్కరభట్ల, అనంత శ్రీరామ్‌, వనమాలి, కలువ కృష్ణసాయి, స్క్రీన్‌ప్లే: రాజేంద్ర రెడ్డి, ఆర్ట్‌: ధర్మేంద్ర, లైన్‌ ప్రొడ్యూసర్‌: భరత్‌.సి, సమర్పణ: జగపతిబాబు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com