పోసాని "జెంటిల్ మేన్"
     'మెంటల్‌ కృష్ణ'... ఈ పేరు వినగానే గుర్తుకొచ్చే దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి. ఇప్పుడాయన 'జెంటిల్‌మేన్‌'. వీరభద్ర ప్రొడక్షన్స్‌ సంస్థ ఆయన కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రానికి ఆ పేరు ఖరారు చేశారు. ఆయనే దర్శకుడు. ఆర్తి అగర్వాల్‌, నటాషా నాయికలు. నల్లం పద్మజ నిర్మాత. 'జెంటిల్‌మేన్‌' చిత్రం చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ''నేను బాగా ఇష్టపడి రాసుకున్న కథ ఇది. పెళ్త్లెన కొత్తలో భార్య మీద భర్త ఎంతో ప్రేమ కనబరుస్తాడు. ఏళ్లు గడిచే కొద్దీ అది తేలిపోయినట్టవుతుంది. అందుకు కారణం ఏమిటి? మగాళ్లకు చలించే గుణం సహజం. ఆడవాళ్లకు ఆకర్షించే అలవాటుంది. ఈ రెండింటి మధ్య నలుగుతున్న పరిస్థితులు ఏమిటి? అనేది అసలు కథ. ఇందులో నేను సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీమ్‌లీడర్‌గా కనిపిస్తాను'' అన్నారు. సమర్పకుడు నల్లం శ్రీనివాస్‌ మాట్లాడుతూ ''మానవతా విలువలను ఆధారం చేసుకుని తీసే సినిమా. ప్రతి మహిళా తలెత్తుకుని చూసేలా ఉంటుంది సినిమా. ఏకధాటిగా ఒకే షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామ''న్నారు. ''తొలిసారి మా నాన్న కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాకు నాన్న పాత్రలో కనిపిస్తార''ని ఆర్తి చెప్పారు. 'జెంటిమేన్‌'లో జితిన్‌, నాగేంద్రబాబు, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, సుధ, హేమ, సురేఖావాణి, సత్యశ్రీ, శశాంక్‌ అగర్వాల్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: యు.మల్లిక్‌శర్మ, కళ: పి.ఎస్‌.వర్మ, ఛాయాగ్రహణం: ఆనంద్‌.సి.కుమార్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com