Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
గోపీచంద్‌ 'గోలీమార్‌'
     గోపీచంద్‌, ప్రియమణి జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న 'గోలీమార్‌' చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీచంద్‌పై చిత్రీకరించిన ముహుర్తపు దృశ్యానికి పూరి జగన్నాథ్‌ సతీమణి లావణ్య కెమెరా స్విఛాన్‌ చేయగా, బెల్లంకొండ సురేష్‌ సతీమణి పద్మావతి క్లాప్‌ నిచ్చారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ " ఇది ఓ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు కథ. సరికొత్త కథనంతో చిత్రం ఆసక్తిగా వుంటుంది. గోపీచంద్‌ కెరీర్‌లో ఓ వైవిధ్యమైన చిత్రంగా వుంటుంది.

ఈ చిత్రంలో గోపీచంద్‌ను ఓ కొత్త యాంగిల్‌లో చూస్తారు' అన్నారు. గోపీచంద్‌ మాట్లాడుతూ " పూరి జగన్నాథ్‌ చెప్పిన కథ నన్ను ఎంతో ఇన్‌స్పైర్‌ చేసింది. ఇలాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేయడం హ్యాపీగా వుంది. హీరోగా నా రేంజ్‌ని పెంచే చిత్రంగా 'గోలీమార్‌' వుంటుంది' అని తెలిపారు. బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ " ఈ నెల 21 నుంచి మార్చి నెలాఖరు వరకు జరిగే ఒకే షెడ్యూల్‌తో చిత్రాన్ని పూర్తిచేసి వేసవి కానుకగా సినిమాను ఏప్రిల్‌ 28న విడుదల చేస్తాం.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్ర కథకు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ దయానాయక్‌ను ప్రేరణగా తీసుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లోకల్‌ ఇన్సిడెంట్స్‌ని జత చేసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం' అని చెప్పారు. నాజర్‌, రోజా, షావర్‌ అలీ, పశుపతి, ఎం.ఎస్‌.నారాయణ, అలీ, జీవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: చక్రి, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, సమర్పణ: బెల్లంకొండ పద్మావతి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com