ఫిలిం న్యూస్
 
 
 
 
గోపీచంద్, బాలాజీ రియల్ మీడియా చిత్రం

ప్రముఖ కథానాయకుడు గోపీచంద్ హీరోగా, సుప్రసిద్ధ నిర్మాత తాండ్ర రమేష్ బాలాజీ రియల్ మీడియా ప్రై.లిమిటెడ్ పతాకంపైన నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్రం ఈ రోజు అన్నపూర్ణా స్టూడియోస్ లో ప్రారంభమైంది. తొలిషాట్ కథానాయకుడు గోపీచంద్ పై చిత్రించారు. ఈ సన్నివేశానికి దర్శక రత్న దాసరి నారాయణరావు క్లాప్ నివ్వగా, ఎస్.ఎస్.రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. భూపతి పాండ్యన్ గౌరవ దర్శకత్వం వహించారు. అతిథులుగా విచ్చేసిన సినీ ప్రముఖఉలు దర్శకుడు జి.భూపతి పాండ్యన్, నిర్మాత తాండ్ర రమేష్, చిత్రం సమర్పకులైన కొమర వెంకటేస్ గార్లకు శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ - మా హీరో గోపీచంద్ సరసన ఓ ప్రముఖ హీరోయిన్ ని ఎంపిక చేస్తున్నాము. అలాగే ఇందులో నటించే నటీనటుల వివరాల్ని అతి త్వరలో తెలియజేస్తాము’ అన్నారు. డైరెక్టర్ పై నమ్మకంతో ఈ సినిబా తీయడానికి సిద్ధం అయ్యాను. రెగ్యులర్ షెడ్యూల్ మార్చి మొదటివారం నుంచి ప్రారంభమవుతుంది. తెలుగులో మొదట పూర్తి చేసి తరువాత తమిళ నెటివిటీకి తగ్గట్టు ప్లాన్ చేస్తాము అని అన్నారు.

గోపీచంద్ మాట్లాడుతూ - ఎంటర్ టైన్ మెంట్ మరియు డిఫరెంట్ లవ్ స్టోరీ మిక్స్ అయిన కథ ఇది. వినగానే బాగా నచ్చి ఒప్పుకున్నాను. ఇందులో నా యాక్షర్ పవర్ ఫుల్ హీరోయిజాన్ని చూపిస్తుంది. ఈ మూవీ నాకు డిఫెనెట్ గా వర్క్ అవుట్ అవుతుంది అని అన్నారు.

భూపతి పాండ్యన్ మాట్లాడుతూ - తెలుగులో మొదటి మూవీ. యాక్షర్ ఎంటర్ టైన్ మెంట్ మరియు రొమాన్స్ కలిగిన చిత్రమిది. మీ అందరి ఆశీస్తులు మాకు కావాలని అన్నారు.

సాంకేతిక వర్గం - తమన్ సంగీతం అందించనున్న ఈ భారీ చిత్రానికి మాటలు : యం.రత్నం, ఛాయాగ్రహణం: శక్తి శరవణన్, ఆర్ట్ : కార్తీక్ రాజ్ కుమార్, ఎడిటింగ్, కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బండి శేషయ్య, ప్రొడక్షన్ మనేజర్స్ : మహేంద్రరెడ్డి, ఆర్.శేషాద్రి రాజు, నిర్మాత : తాండ్ర రమేష్, సమర్పణ : కొమర వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం : జి.భూపతి పాండ్యన్.