'అరుంధతి' ఫేం దివ్య, నందు జంటగా దర్శకుడు గోవింద్ వరహా తీసిన చిత్రం 'నేను నాన్న అబద్ధం'. ఇటీవలే విడుదలై
అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. సోమవారంనాడు మీడియాతో పలు విషయాలు ఇలా పంచుకున్నారు...
'వైజాగ్ జిల్లా జె.నర్సిపట్నం వద్ద జె.నాయుడుపాళెంలో పుట్టిన నాకు సినిమాలంటే చాలా ఇష్టం.
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సూపర్‌గుడ్ బ్యానర్‌లో 'సుస్వాగతం' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం
కల్గింది. తర్వాత కరుణాకర్ 'తొలిప్రేమ'కు పనిచేశాను. ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఆనందసాయి సహకారంతో ప్రొడక్షన్
డిపార్ట్‌మెంట్‌ను పరిశీలించాను. చందనా రమేష్ తీసిన 'బాల' చిత్రానికి దర్శకుడిని అయ్యాను. కొన్ని కారణాలవల్ల ఆ చిత్రం
ఆగిపోయింది. నేను నాన్న అబద్ధం...చిత్రం కథ తయారు చేసుకున్నాక...'ఫొటో' ఫేం నందు పరిచయమయ్యాడు. తర్వాత
ఆయనే నాకు నిర్మాతల్ని పరిచయం చేశారు. అప్పుడు ఈ కథ నచ్చడంతో నిర్మాణం సాగింది. టైటిల్, ట్రైలర్స్
విడుదలయ్యాక దాసరిగారు బాగున్నాయని కామెంట్ చేశారు. తర్వాత వెళ్లి కలిశాను. నన్ను అభినందించడమే కాకుండా
తప్పకుండా చూస్తానన్నారు. ఆస్కార్ అవార్డు పొందినంత సంబరం కలుగుతోంది' అని అన్నారు.
చిత్ర స్పందన గురించి చెబుతూ... దాసరి గారు ఈ సినిమా గురించి టైటిల్, ట్రైలర్స్ బాగున్నాయి అని కామెంట్ చేశారని
తెలిసి, ఆయన్ను వెళ్ళి కలిశాను. ఆయన నన్ను ప్రత్యక్షంగా అభినందించడమే కాకుండా ఈ సిరిమాను తప్పకుండా
చూస్తాను అని చెప్పారు. ఆయన అభినందన నేను ఆస్కార్ అవార్డులాగా భావిస్తాను.
'70 సెంటర్లలో విడుదలైంది. ప్రస్తుతం 2వ వారంలోకి ప్రవేశించింది. వైజాగ్ తదితర ప్రాంతాల్లో కలెక్షన్లు బాగున్నాయి.
చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నాను. యుక్త వయస్సులో చిగురించే ప్రేమలు ఇందులో చూపెట్టాం. క్లైమాక్స్
ప్రేక్షకులకు నచ్చింది. మంచి సినిమాను తప్పకుండా ఆదరిస్తారని రుజువైంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన ప్రకాష్
భరద్వాజ్ మంచి ప్రతిభను కనబర్చారు. యండమూరి వీరేంద్రనాథ్ చెప్పే డైలాగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో
మరో చిత్రంతో ముందుకు వస్తాను' అని తెలిపారు.