2మచ్, ఎక్స్ ట్రా చిత్రాల సక్సెస్ తర్వాత శ్రీచిత్ర బ్యానర్ పై హ్యాట్రిక్ హిట్ చిత్రంగా డా. రాజేంద్రప్రసాద్, పార్దు, డా. బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా ‘గుడు గుడు గుంజం’ షూటింగ్ బ్యాంకాక్ లో ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతంలో ప్యాచ్ వర్క్ పూర్తిచేసి సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత వి.రవికుమార్ రెడ్డి తెలిపారు.
దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో 60రోజుల షూటింగ్ జరిపిన ఈ చిత్రం రెండుసార్లు బ్యాంకాక్ వెళ్ళి 50% సీన్లు, 7పాటలు రెండు కెమెరాలతో నిర్విరామంగా జరిపామని, నలుగురు హీరోయిన్స్, పార్దు (నవదీప్ బ్రదర్), డా.బ్రహ్మానందం కామెడీ ట్రాక్ తో 24రోజులపాటు చేశామని మరో నిర్మాత శ్రీధర్ వర్మ తెలిపారు.
రాజేంద్రప్రసాద్ చాలాకాలం తర్వాత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ ‘గుడు గుడు గుంజం’ ఆడియో విడుదల చేయనున్నారు. సినీగోయల్ డాట్ కామ్ ద్వారా ఈ చిత్రంలో హైలైట్ సాంగ్ ‘మహిమహిమహిరే’ అనే పాటను ఈ నెల 10వ తేదీన నెట్ ద్వారా ప్రిప్రమోషన్ గా విడుదల చేయనున్నామని సంగీత దర్శకుడు వీరు తెలిపారు. ఇదే పాటను 11వ తేదీ నుండి ఎస్.ఎఫ్.ఎం. రేడియో ద్వారా ఆంద్రశ్రోతల అభిమానం పొందనుందని తెలిపారు.
నిర్మాత రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ- ‘చిన్నచిత్రాలలో అతిపెద్ద చిత్రంగా సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రం ఆడియో రిలీజ్ కి ముందే సీడెడ్ మినహా బిజినెస్ అయిందని, అండర్ ప్రొడక్షన్ లో ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి సహకరించిన రాజేంద్రప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ నెల 25న ఆడియో విడుదల సందర్భంగా ఈ సినిమా పబ్లిసిటీ డిఫరెంట్ గా, సుమారు 25లక్షల రూపాయలు వెచ్చించి ఈ సినిమా చూసే ప్రేక్షకులకు నేరుగా అందే విధంగా ప్లాన్ చేయనున్నామని’ తెలిపారు.
రాజేంద్రప్రసాద్, పార్దు, బ్రహ్మానందం, సుమన్, సితార, కస్తూరి, చాహత్, ఫరాఖాన్, రితిమ, ఆర్తి, కృష్ణభగవాన్, ఎం.ఎఎస్.నారాయణ, కొండవలస, తెలంగాణ శకుంతల, గుండు సుదర్శన్ తదితరులు నటించారు. స్క్రీన్ ప్లే : మరుదురి రాజా, మాటలు : నంద్యాల రవి, నృత్యాలు : ప్రసన్న, ప్రేమ, పాటలు:కులశేఖర్,భాస్కరభట్ల, విశ్వ, ఆర్ట్ : బాబ్జి, ప్రొడక్షన్ కంట్రోలర్: రాజేష్ రంబాల, కాస్ట్యూమ్ : జాని, ఎడిటింగ్ : నందమూరి హరి,కథ-సంగీతం-దర్శకత్వం : వీరు.