‘‘సినిమా బలమైన మాధ్యమం. దీని ద్వారా ప్రజల ఆరోగ్యం, విద్య, భద్రత... తదితరాలపై అవగాహన పెంచే ఈ ప్రయత్నం
అభినందనీయం. సినిమా ద్వారా నేరుగా ‘హ్యాపీ ఇండియా’ కార్యక్రమం అందుబాటులోకి రావడం ప్రశంసనీయం’’ అన్నారు
దర్శకుడు ఎన్.శంకర్. ‘హ్యాపీ ఇండియా’ పేరుతో ఆంధ్రప్రదేశ్ సినీ ప్రియులు, ప్రేక్షకుల ముంగిటికి సరికొత్త కార్యక్రమాలు
అందుబాటులోకి తెస్తోంది ‘ఎపిమీడియా ఫౌండేషన్’. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాష్ట్ర
పౌరసరఫరాల శాఖామాత్యులు శ్రీధర్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎన్.శంకర్, చంద్ర సిద్ధార్థ్ సంస్థ వెబ్
సైట్లను ఆవిష్కరించారు.
హ్యాపీ ఇండియా కార్యక్రమాలపై ఫౌండేషన్ హెడ్ రమేష్ బాబు మాట్లాడుతూ - ‘హ్యాపీ ఇండియా సభ్యుల కోసం... కొత్త
సినిమాల రిలీజ్ లు తొలి రోజు ఉదయం ఆటను ప్రత్యేక షోలు వేస్తాం. దూకుడు, :శ్రీరామరాజ్యం, ఊసరవెల్లి... ఇలా ప్రతి
సినిమా ప్రదర్శిస్తున్నాం. మరన్ని వివరాలు... హ్యాపీ ఇండియా డాట్ ఓఆర్ జి, ఎపి మూవీస్ డాట్ కాంలలో లభిస్తాయి’’
అని తెలిపారు. ఎ.పి.ఫిలిం ఛాంభర్ కార్యదర్శి శక్తి రమేష్, తదితరలు వేడుకలో పాల్గొన్నారు.
|