Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘‘హ్యాపీ హ్యాపీగా...’’
      'హ్యాపీడేస్‌' ఫేం వరుణ్‌సందేశ్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'హ్యాపీ హ్యాపీగా'. వేగ, శరణ్యమోహన్‌ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రియా శరణ్‌ దర్శకుడు. రంజిత్‌ మూవీస్‌ సమర్పణలో ఓషియన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై వడ్లమూడి దుర్గాప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్‌ దశలో వున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ " తమిళ 'బిల్లా' దర్శకుడు విష్ణువర్థన్‌, ఎడిటర్‌ మోహన్‌ తనయుడు, దర్శకుడు రాజా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రియాశరణ్‌ చెప్పిన కథలోని నవ్యత, వైవిధ్యం నచ్చి ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. నేటి యువతరం మెచ్చే విధంగా సినిమా వుంటుంది. సంగీత దర్శకుడు మణిశర్మ తన బాణీలతో పాటు ఆశ్శీస్సులు కూడా ఈ చిత్రానికి అందజేస్తున్నారు.

ప్రేమకథా చిత్రాల్లో సరికొత్తగా నిలిచే విధంగా చిత్రం వుంటుంది. జూన్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. అలీ, ఎం.ఎస్‌.నారాయణ, బొమ్మాళి రవి, రాజాశ్రీధర్‌, రంజిత, తెలంగాణ శకుంతల తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అనిల్‌ రావిపూడి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కెమెరా: వెంకి.ఎ.దర్శన్‌, ఎడిటర్‌: కె.వి.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేకానంద కూచిభొట్ల.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com