Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
సయ్యద్ రఫీ ‘హ్యాపీ రిటర్న్స్’
     రాహిల్స్ మూవీ పతాకంపై సయ్యద్ రఫీ స్వీయ రచన దర్శకత్వంలో నిర్మించిన ‘హ్యాపీ రిటర్న్స్’ చిత్రం డి.టి.ఎస్. మిక్సింగ్ జరుపుకుంటోంది. త్వరలో ఆడియో ‘ఆదిత్య మ్యూజిక్’ ద్వారా విడుదల చేసి, ఇదే నెలలో చిత్రాన్ని కూడా విడుదల చేస్తామని - రఫీ చెప్పారు.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాప్ట్ వేర్, రియల్ ఎస్టేట్ బూమ్ సమయంలో ఉన్న పరిస్థితిని, అది పడిపోయినప్పటి దుస్థితిని ఈ చిత్రంలో సహజంగా చూపించాం. ‘మె ధ డ్ యాక్టింగ్’ ఫార్ములా ఇందులో ఉపయోగించాం. 4 పాటలుంటాయి - అని చెప్పారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ విడుదలయ్యింది, తద్వారా వచ్చిన ఉత్సాహంతో తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులను ఈ చిత్రం తప్పక ఆకట్టుకుంటుందని అన్నారు.

రఫీ, అంజలి ద్వివేది, అనీల్, విజయ్ కుమార్, షబ్ను, టి.ఎస్.రాజు, రాధాకృష్ణ, చందు, శ్రీకాంత్, ప్రకాష్ రావు ఈ చిత్రంలో నటీనటులు. ఫోటోగ్రఫీ : అమర్, లక్ష్మణ్, రచన, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం : సయ్యద్ రఫీ.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com